బ్రహ్మనాయుడు కుటుంబానికి వైయ‌స్‌ జగన్‌ భరోసా 

బొల్లా గిరిబాబుతో ఫోన్‌లో మాట్లాడిన మాజీ సీఎం

తాడేప‌ల్లి: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి  వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలబడుతుందని మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బ్రహ్మ­నాయుడు అరెస్ట్‌ నేపథ్యంలో మాజీ సీఎం వైయ‌స్‌ జగన్ బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా గిరిబాబుతో ఫోన్‌లో మా­ట్లాడి ధైర్యం చెప్పారు.  పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన న్యా­య సహాయాన్ని పార్టీ లీగల్‌ సెల్‌ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు ఆరోప­ణలు, రాజకీయ కక్షసాధింపు చర్యలకు భయ­పడాల్సిన అవసరం లేదని, సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని భరోసా కల్పించారు. 

Back to Top