తాడేపల్లి: ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ కొత్త లోగోను ఆవిష్కరించుకున్న సందర్భంగా వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థకు అభినందనలు తెలిపారు. విలువలు, విశ్వసనీయతతో ఎన్డీటీవీ బలమైన మీడియా సంస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. ధైర్యం, బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జర్నలిజం మౌలిక సూత్రాలను కొనసాగిస్తూ వస్తోందని వైయస్ జగన్ కొనియాడారు. కీలక సమయాల్లో ప్రజలకు నమ్మకమైన గొంతుకగా ఎన్డీటీవీ నిలవాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ, కొత్త లోగో ఆవిష్కరణ సందర్భంగా ఎన్డీటీవీ యాజమాన్యంతో పాటు జర్నలిస్టులు, సిబ్బందికి వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.