అమరావతి: దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఇచ్చిన ప్రతిహామీని బాధ్యతగా నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. సముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేది. దీనిని ఇప్పుడు వైయస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైయస్‌ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైయస్ జగన్ తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా వ్యక్తం చేశారు. మత్స్య దినోత్సవం సందర్భంగా వైయస్‌ఆర్ మత్స్యకార భరోసా ద్వారా వేటనిషేధ పరిహారం రూ.10,000,డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంపు, వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందిస్తాం.’ అని పేర్కొన్నారు. కాగా పథకంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించింది. Read Also: మత్స్యకారులకు మంచి రోజులు