వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల దాతృత్వం 

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కూరగాయలు పంపిణీ

 మెల్లెంపూడి గ్రామంలో ప్రతి ఇంటికి ఐదు రకాల కూరగాయలు

 తాడేపల్లి:  కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో సామాన్యలు ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని ఇన్ని కావు.  దినసరి కూలీలు, నిరుపేదల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉండటంతోఎన్నో నిరుపేద కుటుంబాలు నీళ్లు తాగి బతుకుతున్నాయి . ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు అండగా నిలవాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం పిలుపు మేరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  ఆపన్న హస్తాలను అందిస్తున్నారు.  తాడేపల్లి మండలంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.  మెల్లెంపూడి గ్రామంలో ఎమ్మెల్యే ఆర్కే ఆదేశాల మేరకు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు  గ్రామంలోని ప్రతి ఇంటికి ఐదు రకాల కూరగాయలు ఉచితంగా పంపిణీ చేసి సేవా గుణాన్ని చాటుకున్నారు. దీంతో గ్రామస్తులు సీఎం వైయస్‌ జగన్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top