అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు వైయస్ఆర్‌సీపీ తరఫున ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి వద్ద ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున మాధవరావును డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిపిన నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలు ఆయనకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ తన అభ్యర్థిని బరిలో నిలపడంతో మండలిలో ఎన్నికపై ఆసక్తి నెలకొంది. పార్టీ ఎమ్మెల్సీల సమక్షంలో తుమాటి మాధవరావు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.