తిరుమల: అన్నమయ్య భవన్‌లో తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశానికి పాలక మండలి సభ్యులందరూ హాజరయ్యారు. సమావేశంలో 58 అంశాలపై చర్చ అనంతరం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని నవీ మంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పత్రాలను ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని రేమండ్ గ్రూప్ చైర్మన్, ఎండీ గౌతమ్ సింఘానియా తరపున, రేమండ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ సరిన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రే, సంజీవ్ సారిన్‌లను టీటీడీ చైర్మన్ సత్కరించారు. నవీ ముంబయిలోని ఉల్వేలో 10 ఎకరాల భూమిని కేటాయించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.