తిరుపతి: దళితులను గుండెల్లో పెట్టుకున్న పార్టీ వైయస్ఆర్‌సీపీ అని తిరుపతి వైయస్ఆర్‌సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి ఉద్ఘాటించారు. నా సోదరుడు ఆదిమూలం పార్టీపైన, పార్టీలోని పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. వైయస్ఆర్‌సీపీలో ఎస్సీలకు గౌరవం లేదు అని ఆదిమూలం అన్నారు. నేను సూటిగా చెప్తున్నా..స్వాతంత్య్రం వచ్చి ఇప్పటి వరకూ ఎస్సీలు ఆత్మగౌరవంతో బతికేలా చూసుకున్నది ఒక వైయస్ఆర్‌సీపీ పార్టీ, ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు. తిరుపతి వైయస్ఆర్‌సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి మీడియాతో ఏం మాట్లాడారంటే: ఆదిమూలం పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు: – మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు కొన్ని కారణాల వల్ల నన్ను సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగా, తిరుపతి లోక్‌సభ సమన్వయకర్తగా కోనేటి ఆదిమూలం గారిని నియమించారు. – మనం పార్టీకి బద్దులం అయి ఉన్నప్పుడు పార్టీ అధినేత ఆలోచనలకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – నా సోదరుడు ఆదిమూలం పార్టీపైన, పార్టీలోని పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. – వైయస్ఆర్‌సీపీలో ఎస్సీలకు గౌరవం లేదు అని ఆదిమూలం అన్నారు. – నేను సూటిగా చెప్తున్నా..స్వాతంత్య్రం వచ్చి ఇప్పటి వరకూ ఎస్సీలు ఆత్మగౌరవంతో బతికేలా చూసుకున్నది ఒక వైయస్ఆర్‌సీపీ పార్టీ, ప్రభుత్వం మాత్రమే. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ వాళ్ల ఇంటి గుమ్మం వద్దే ప్రతిఒక్క సంక్షేమ పథకాన్ని పొందుతున్నారు. – టీడీపీ ప్రభుత్వంలోలా జన్మభూమి కమిటీల వద్దకు వెళ్లి వాళ్ల సిఫార్సు మేరకు తీసుకునే పరిస్థితి నేడు లేదు. – ఈ రాష్ట్రంలో ఉండే దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు తలెత్తుకుని తిరిగేలా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు. – అందుకే వారంతా ఆత్మగౌరవంతో సంతృప్తిగా ఉన్నారు. – ఆదిమూలం తాను ఎమ్మెల్యేగానే ఉండాలి అనుకుంటే ఆయన అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకోవచ్చు. – కానీ లేనిపోని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. – నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం, అనుభవం లేకపోయినా..వైయస్ఆర్‌సీపీలో నిజాయితీగా పనిచేసే వ్యక్తికి ఎలాంటి గౌరవం దక్కుతుందో నేనే నిదర్శనం. – ఆదిమూలం సేవలను గుర్తించి ఎంతో అభిమానంతో జగన్ గారు ఆయనకు ఎంపీగా ప్రమోషన్‌పై పంపారు. – ఆయన్ను ఎవరూ అగౌరవపరచలేదు..అలా ఎవరూ చేయబోరు కూడా. – ఆదిమూలం వీధికెక్కి పార్టీ పరువు, ప్రతిష్ఠను బజారుకీడ్చేలా మాట్లాడటం అత్యంత హేయం. తిరుపతి లోక్‌సభ ఇంఛార్జి ఇవ్వడం గొప్ప గౌరవం: – మాట్లాడేటప్పుడు ఆయన సమన్వయంతో మాట్లాడాలి. ఏదైనా సమస్య ఉంటే పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి. – సమస్యను పరిష్కరించుకోవాల్సింది పోయి వేరేపార్టీ వారితో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారా అనేది కూడా ఆలోచించుకోవాలి. – పార్టీ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాజకీయ లబ్ధి చేకూరుస్తారు అని వారేమైనా చెప్పారా అనేది కూడా ఆలోచించాలి. – తిరుపతి లోక్‌సభ సభ్యుడు అంటే దేశంలోని పదవుల్లో గౌరవమైన పదవుల్లో ఇది కూడా ఒకటి అని నేను భావిస్తున్నా. – ఈ దేశానికి రాజధాని ఢిల్లీ అయితే ఈ దేశానికి ఆద్యాత్మిక రాజధాని తిరుపతి. – సాక్షాత్తు కలియుగ వేంకటేశ్వర స్వామి కొలువున్న ఈ ప్రాంతానికి లోక్‌సభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. – అలాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని మీకు అప్పజెబితే లేనిపోని దురుద్దేశాలతో మాట్లాడటం సరికాదు. – ఎస్సీలకు టీడీపీ హయాంలో కేవలం రూ.8700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. – జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.45వేల కోట్ల నిధులు నేరుగా వారి ఖాతాల్లోకి ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా వెళ్తోంది. – ఏ ముఖ్యమంత్రి సాహసించని విధంగా అందరికీ దైవసమానులైన బీఆర్ అంబేద్కర్ ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి మన ఆత్మగౌరవాన్ని నిలిపారు. – పదవుల్లో ఎస్సీలకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. 5 మంత్రి పదవులు ఇచ్చారు. – కార్పొరేషన్ పదవులు, ఉద్యోగాల్లో దాదాపు 20 శాతం ఎస్సీలకు సముచిత స్థానం కల్పించారు. – ఇంత చేస్తున్న పార్టీని మన స్వార్ధం కోసం దుమ్మెత్తిపోయడం అత్యంత దారుణం. – ఆదిమూలం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నా. తనకు చెప్పకుండా తిరుగుతున్నారనడంలో వాస్తవం లేదు: – నాకు చెప్పకుండా నియోజకవర్గంలో తిరిగారు అంటున్నారు..నేను ముందే ఫోన్లు చేశారు. – ఒక రోజు బయటకు వెళ్తున్నా అన్నారు..మరొకసారి పనుందని తప్పించుకున్నారు. – నియోజకవర్గంలోకి వెళ్లే ముందు మీ ఇంటికి వస్తే..మీరు తిరుపతిలో ఉన్నారన్నారు. అక్కడికీ వచ్చాను... – అక్కడి నుంచి మీరు ఎక్కడికో వెళ్లారు. వారం రోజుల నుంచి ప్రయత్నం చేసినా తప్పించుకు తిరిగారు. – నేనే కాదు పార్టీలోని అందరూ ఆయన కోసం ప్రయత్నం చేస్తే తప్పించుకున్నారు. – మీ స్వార్ధ ప్రయోజనాలు చూసుకుంటే చూసుకోండి కానీ తల్లిలాంటి పార్టీపై బురదజల్లడం సరైంది కాదు. – నేను తిరుపతి పార్లమెంటు సభ్యునిగా ఉన్నాను..సత్యవేడు ఇంఛార్జిగా ఉన్నాను. – నేను మా పార్టీకి సంబంధించిన సమావేశం ఎక్కడ పెట్టుకోవాలో నా ఇష్టం. – తిరుపతిలో ఎన్నో మీటింగులు, రీజనల్ మీటింగులు జరుగుతూనే ఉంటాయి. దాన్ని సాకుగా చూపి మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడటం సబబు కాదు. – ఆదిమూలం కుమారుడు వెళ్లేప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడాను. ఆయన బర్త్‌డేకి విషెస్ చేశాను. – ఆదిమూలం కుమారుడు మీటింగులో పాల్గొనడం జరిగింది. మా నాన్న తిరుపతి ఎంపీగా మూడున్నర లక్షల మెజార్టీతో గెలుస్తారు అని కూడా చెప్పారు. – మధ్యలోనే లోపాయికారిగా ఎక్కడో మాట్లాడుకుని లేనిపోని కుంటిసాకులు చెప్పడం సరికాదు. – టీడీపీతోనో, వేరే పార్టీలతోనో లోపాయికారిగా మాట్లాడుకుని ఉండి ఉండొచ్చు. – ఇసుక అనేది పారదర్శకంగా జరిగిన టెండర్లు. దానికి ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. అనుమతులు అధికారులు ఇస్తారు. – ఎస్సీ నియోజకవర్గం ఒక్క సత్యవేడే కాదుగా..తిరుపతి పార్లమెంటు, సూళ్లూరుపేట వంటివి కూడా ఎస్సీ నియోజకవర్గాలే. – బీఫాం ఇచ్చేందుకు రెండు నెలలు టైం ఉంది. అధిష్టానాన్ని సంప్రదించవచ్చు...కన్విన్స్ చేసుకోవచ్చు. – ముందు అయన అందరితో కలిసే ఉన్నారు. తర్వాత ఏదో పురుగు కుట్టినట్లుంది..అది పచ్చ పురుగో..ఇంకే పురుగో తెలియడం లేదు. – అది పార్టీ పరువును బజారుకీడ్చినట్లే లెక్క. అధిష్టానం దానిపై నిర్ణయం తీసుకుంటుంది. – ఆయన సత్యవేడుకు ఎలా ఎమ్మెల్యేనో...అదే నియోజకవర్గానికి నేను ఎంపీని కూడా. – నేను నేరుగా అధికారులతో మాట్లాడవచ్చు. కానీ నేను ఆయనతో కలిసే వెళ్లాను. – పార్టీ ప్రొటోకాల్ ప్రకారం నేను అన్ని సందర్భాల్లో ఆయన్ను సంప్రదిస్తూనే ఉన్నాను.