నిబ‌ద్ధ‌త‌..ద‌మ్మున్న నాయ‌కుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అంద‌రికీ ప్ర‌యోజ‌నం క‌లిగేలా ఉచిత విద్యుత్ ప‌థ‌కం

కేంద్రం తెచ్చిన కొత్త చ‌ట్టాల‌కు అనుగుణంగా సంస్క‌ర‌ణ‌లు

న‌గ‌దు బ‌దిలీపై టీడీపీది అన‌వ‌స‌ర రాద్ధాంతం 

ఉచిత విద్యుత్‌పై వైయ‌స్ఆర్‌, వైయ‌స్ జ‌గ‌న్‌కే పేంటెంట్ హ‌క్కు

బెల్టుషాపులు టీడీపీ పేంటెంట్లు

గ‌త ప్ర‌భుత్వ బ‌కాయిలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెల్లిస్తున్నారు

ప‌గ‌టిపూట 9 గంటల పాటు నాణ్య‌మైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు  స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిబ‌ద్ధ‌త‌, ద‌మ్మున్న నాయ‌కుడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అంద‌రికి ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు ఉచిత విద్యుత్ ప‌థ‌కానికి సంబంధించి న‌గ‌దు బ‌దిలీ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టార‌ని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేద‌న్నారు. కేంద్రం తెస్తున్న సంస్క‌ర‌ణ‌ల‌కు అనుగుణంగా రాష్ట్రంలో రైతుల‌కు న‌ష్టం ఉండ‌కూడ‌ద‌నే ముందుచూపుతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ న‌గ‌దు బదిలీకి ముంద‌డుగు వేశార‌ని చెప్పారు. విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల రైతుల‌కు ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌న్నారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

అపోహాలు తొలగిస్తున్నాం..

రైతుల‌కు ఉచితంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసే ప‌థ‌కంలో అంద‌రికీ ప్ర‌యోజ‌నం క‌లిగే విధంగా..రైతుకు శాశ్వ‌తంగా ఒక న‌మ్మ‌క‌మైన‌, నాణ్య‌త‌తో కూడిన విద్యుత్‌ను ఉచితంగా స‌ర‌ఫ‌రా చేసేదిశ‌గా మొన్న విడుద‌లైన ఉత్త‌ర్హుల మీద టీడీపీ నేత‌లు, కొంత అర్కేస్ట్రా పార్టీలు, వీళ్లు క్రియేట్ చేసిన అపోహాలు, అనుమానాలు చూసి కొంత మంది సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎవ‌రికో సంజాయిషీ ఇవ్వ‌డం కాకుండా ఈ అపోహాల‌ను తొల‌గించే ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వ ప‌రంగా జ‌రుగుతోంది. వాస్తవం ఏంటి?  ఇందులో నిజ‌మెంతా అన్న‌ది ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నాం. ఉచిత విద్యుత్ త‌క్కువ ధ‌ర‌తో రైతులు ఏదో ప్ర‌భుత్వాన్ని కోరుతున్నార‌ని ఇంత‌కు ముందు ఆర్థిక‌వేత్త‌లు అంటున్న దాన్ని తిప్పికొడుతూ..వాళ్ల‌కాళ్ల మీద రైతులు నిల‌బ‌డి..తామే బిల్లులు చెల్లిస్తున్నామ‌నే దీమా ఇచ్చేందుకు...అలాగే పంపిణీ సంస్థ‌లు, డిస్క‌మ్‌లు అప్పుల‌బారిన ప‌డ్డాయి. వేల కోట్లు ప్ర‌భుత్వాలు బ‌కాయిలు పెడితే..వ్య‌వ‌స్థ‌లు మొత్తం కుప్ప‌కూలాయి. దీని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలి..అదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం వాళ్ల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా తీసుకొస్తున్న చ‌ట్టంలోని స‌వ‌ర‌ణ‌లు త‌ప్ప‌నిస‌రిగా వ‌చ్చి..మ‌న‌పై ప‌డే అవ‌కాశం క‌ళ్ల‌ముందు క‌న‌బ‌డుతుంటే..వాటికి త‌గిన విధంగా మ‌న రాష్ట్రంలో సంస్క‌ర‌ణ‌లు చేసి, స‌మ‌యాత్తం చేస్తున్నాం.  

ప్ర‌తి ఒక్క‌రూ సానుకూలంగా స్పందించాల్సిన స‌మ‌యం ఇది..

ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకునే ప్ర‌భుత్వ‌మైతే ఏం చేస్తుందో ..ఇలాంటి కు విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని తెలిసీ కూడా నిబ‌ద్ధ‌త‌, ద‌మ్ము ఉన్న నాయ‌కుడిగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఈ మేలి సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా ఒక పెద్ద ముంద‌డుగు వేశారు. దీనిపై ప్ర‌తి ఒక్క‌రూ సానుకూలంగా స్పందించాల్సిన స‌మ‌యం ఇది. ఏదైనా లొసుగులు వ‌స్తాయ‌న్న ఆలోచ‌న‌లు ఉంటే ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇవ్వ‌వ‌చ్చు. ఇది కాకుండా వితండ‌వాదం చేస్తూ..రైతుల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని చూస్తున్నారు. 

ఉచిత విద్యుత్ పేంటెంట్ వైయ‌స్ఆర్ కుటుంబానిదే..

నిజానికి ఉచిత విద్యుత్ ప‌థ‌కం అన్న‌ది ఎవ‌రో పోరాడి సాధించుకున్న‌ది కాదు..డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆలోచ‌న‌. ప్రాజెక్టుల‌తో డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తున్నాం..అదే స‌మ‌యంలో మెట్ట ప్రాంతాల్లో రైతులు బోర్లు వేసుకొని ఇబ్బందులు ప‌డుతున్నార‌ని గ‌మ‌నించి..ఒక హేత‌బ‌ద్ధ‌మైన ఆలోచ‌న చేశారు. ఆ నాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒప్పుకోక‌పోయినా ..వైయ‌స్ఆర్ ఒంటి చేతితో పోరాడి ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు. అంత‌కు ముందు చంద్ర‌బాబు విద్యుత్ చార్జీలు య‌డాపెడా పెంచారు. ఉద్య‌మించిన వారిపై కాల్పులు జ‌రిపించి, అమాయ‌కుల‌ను పొట్ట‌న‌పెట్టుకున్నారు. ఇవ‌న్నీ గ‌మ‌నించిన వైయ‌స్ఆర్ రైతులకు మేలు చేసేందుకు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌డుతూనే..మొద‌టి సంతకం చేశారు. దీనిపై వైయ‌స్ఆర్‌కు మాత్ర‌మే పేటెంట్ ఉంది. ఆయ‌న ఆలోచ‌న‌తో వ‌చ్చిన వైయ‌స్ఆర్‌సీపీకి, మా నాయ‌కుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మాత్ర‌మే పేటెంట్ ఉంటుంది. టీడీపీకి కూడా పేటెంట్లు ఉన్నాయి. బెల్ట్ షాపులు, మ‌ద్య‌పానాన్ని ప్రోత్స‌హించి బెల్టుషాపులు తెచ్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌, వైయ‌స్ ఆర్ పేంటెంటు మాత్రం ఉచిత విద్యుత్ అని గ‌ర్వంగా చెప్పుకుంటున్నాం. 

 ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌, భ‌రోసా ఏర్పాట్లు చేసే క్ర‌మంలో ఇది ఓ పెద్ద అడుగు..

ఈ రోజు ఈ ప‌థ‌కాన్నికి చిన్న‌పాటి దెబ్బ‌త‌గిలినా, ఆ స్పూర్తికి విఘాతంక‌లుగ‌కుండా చూస్తున్నాం. సీఎం వైయ‌స్ జ‌గ‌న్  శాశ్వ‌త‌మైన ప్రాతిపాదిక మీద ..మొత్తం వ్య‌వ‌స్థ‌కు బ‌రువు కాకుండా, కేంద్రం తీసుకువ‌స్తున్న సంస్క‌ర‌ణ‌ల‌కు అనుగుణంగా రాష్ట్ర రైతుల ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లుగ‌కుండా ముందే ఇక్క‌డ అవ‌స‌ర‌మైన ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌, భ‌రోసా ఏర్పాట్లు చేసే క్ర‌మంలో ఇది పెద్ద అడుగు. ఈ రోజు రైతుకు సంబంధించిన ఉచిత విద్యుత్‌కు సంబంధించి డిస్క‌మ్‌ల‌కు ఎప్పుడో బిల్లులు చెల్లిస్తున్నాం. గ‌త ప్ర‌భుత్వం రూ.8 వేల కోట్లు చెల్లించారు. అలాగే ఫీడ‌ర్ల ఏర్పాటుకు రూ.1700 కోట్లు చెల్లించారు. కుటుంబ పెద్ద‌గా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తూ..దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. కేంద్రం సూచ‌న‌లు, సంస్క‌ర‌ణ‌లు పాటించ‌క‌పోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక‌పక్క 35 ఏళ్ల వ‌ర‌కు విద్యుత్ ఇబ్బందులు లేకుండా 10 మెగా వాట్ల సోల‌ర్ ప‌వ‌ర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థిక భారం త‌గ్గించేందుకు, రైతుల‌కు నాణ్య‌మైన విద్యుత్ ఇచ్చేందుకు ఫీడ‌ర్లు ఏర్పాటు చేస్తున్నాం. న‌గ‌దు బ‌దిలీ వ‌చ్చాక తేడా ఏంటంటే..రైతే నేరుగా బిల్లులు చెల్లిస్తారు. ఆ డ‌బ్బులు డ్రా చేయ‌డానికి బ్యాంకుల‌కు వీలు ఉండ‌దు. ప‌వ‌ర్ క‌ట్ చేసే అవ‌కాశం లేదు. ఇందులో ప్ర‌తిప‌క్షాల‌కు వ‌చ్చిన ఇబ్బందులు ఏంటో చెప్పాలి. ఎఫ్ఆర్‌బీ దాటినా, క‌రోనా వంటి క‌ష్ట‌కాలంలో కూడా బ‌కాయిలు చెల్లించారు. ప్ర‌జ‌ల‌కు నేరుగా రూ.59 వేల కోట్లు చెల్లించాం. రూపాయి అప్పు చేస్తే పైసా కూడా టీడీపీ ఖ‌ర్చు చేయ‌లేదు. మా ప్ర‌భుత్వంలో ప్ర‌తి పైసా ఎలా ప్ర‌జ‌ల‌కు అందించాల‌నే ఆలోచ‌న చేశాం. మీ ప్ర‌భుత్వానికి, మా ప్ర‌భుత్వానికి న‌క్క‌కు, నాగ‌లోకానికి మ‌ధ్య ఉన్న తేడా ఉంది. మీ పాల‌న‌లో లేనివి ఉన్న‌ట్లు చూపించారు. మేం చేస్తున్న‌ది ప‌క్క‌కు నెట్టి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని చూస్తున్నారు. వాళ్ల‌కున్న పైత్యాల వ‌ల్ల త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. 

వీళ్ల దుష్ప్ర‌చారాన్ని న‌మ్మొద్దు..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల కోసం చంద్ర‌బాబు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఆయ‌న ఏం చెప్పాల‌నుకున్నారో..త‌న  కొడుకుతో ట్వీట్లు పెట్టిస్తున్నారు. వాటికి కొంద‌రు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఉచిత విద్యుత్ ప‌థ‌కం పార‌ద‌ర్శంగా కొన‌సాగిస్తాం. 30 ఏళ్లు కాదు..శాశ్వ‌తంగా ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగిస్తాం. ఒక క‌చ్చిత‌మై పునాది వేసి భ‌విష్య‌త్తులో రైతుల‌కు విద్యుత్ క‌ష్టాలు లేకుండా చూడ‌ట‌మే ఈ ప్ర‌భుత్వ ల‌క్ష్యం. వీళ్లు చేసే దుష్ప్ర‌చారాన్ని ఎవ‌రూ న‌మ్మొద్దు. ఉచిత క‌రెంటు ఇవ్వ‌డ‌మంటే క‌రెంటు తీగ‌ల‌పై బ‌ట్ట‌లు ఆరేసుకోవాల‌ని, వ్య‌వ‌సాయం దండ‌గ‌న్న అన్న చంద్ర‌బాబు ఆయ‌న లైన్‌లో ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తారు. రైతుల‌ను ఎలా ఆదుకోవాల‌న్న‌దే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచ‌న‌. ఎట్టి ప‌రిస్థితిలోనూ చిన్న‌పాటి ఇబ్బందులు రాకుండా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

Back to Top