అన్నమయ్య జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని రాజంపేట వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు సురేష్ బాబు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన రాయచోటి లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, తంబల్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాధ రెడ్డి, పీలేరు ఇంచార్జి చింతల రామచంద్రా రెడ్డి, రైల్వేకోడూరు ఇంచార్జి కొరముట్ల శ్రీనివాసులు, మదనపల్లె ఇంచార్జి నిస్సార్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాను ఆదర్శంగా నిలుపుదాం: ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధ రెడ్డి వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలోపార్టీని బలోపేతం చేసి, రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లాను పార్టీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధ రెడ్డి అన్నారు. 29 అనుబంధ విభాగాల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మహిళలకు, యువతకు కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వైయస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ కోసం అనునిత్యం కష్టపడుతున్న కార్యకర్తలు, నాయకులకు ఏ ఇబ్బందులు వచ్చినా పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. ఎన్నికల సమయంలో అపద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలనపై ఏడాది పాలనలోనే ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. హామీల అమలులో చంద్రబాబు ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. పార్లమెంటరీ పరిశీలకులు సురేష్ బాబు మాట్లాడుతూ.. 2029 లో వైయస్ జగన్ ను తిరిగి ముఖ్యమంత్రి గా చేసుకునేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికిడిగా పనిచేయాలన్నారు. తంబల్లపల్లె ఎంఎల్ఏ పెద్దిరెడ్డి ద్వారక నాధ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెల్లి ఎండగట్టాలన్నారు.