మేనిఫెస్టోనే కరదీపికగా సమన్యాయం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి
 

తాడేప‌ల్లి: మేనిఫెస్టోనే కరదీపికగా సమన్యాయం, సమగ్రత, సమానత్వం ధ్యేయంగా సీఎం వైయ‌స్ జగన్ గారు పాలన అందిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ప్రభుత్వం వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలు ఉచితాలు కావు. వారి భవిష్యత్తుకు పెట్టుబడి అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.

 

తాడేపల్లిలోని వైయ‌స్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వతంత్ర భారతావని 75 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మహనీయులను స్మరించుకోవడం జరిగింది. జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
 

మన స్వతంత్ర భారతావని నేటితో 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా దేశ ప్రగతికి, వికాసానికి ప్రతిఒక్కరూ పునరంకితమవుదాం.

భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాల శుభసమయంలో భారతీయులకు, ఆంధ్రప్రదేశ్‌ సహా తెలుగుప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయపతాకం ఆవిష్కరించబడును. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సమస్తప్రజానీకానికి సర్వశుభాలు అందించాలని కోరుకుంటున్నాన‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top