టీడీపీ వుయ్ యాప్‌పై ఈసీకి ఫిర్యాదు 

 
అమ‌రావ‌తి:  తెలుగుదేశం వుయ్ యాప్ పై ఎన్నికల సంఘానికి, రాష్ట్ర డిజిపికి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది.  ఫిర్యాదును ఎన్నికల సంఘానికి, డిజిపికి  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ అద్యక్షుడు నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి అంద‌జేశారు.

     తెలుగుదేశం పార్టీ వుయ్ అనే యాప్  తీసుకువచ్చింది.ఈ యాప్ లో ప్రజలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం నిక్షిప్తమై ఉంది. ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఓటర్ ఐడి,వారి సచివాలయ పరిధి,ఓటర్ నంబర్ వారు ఏ పార్టీ సానుభూతిపరులు తదితర అంశాలు ఉన్నాయి.వాటిని దగ్గర ఉంచుకుని టిడిపి కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో ఓటర్ స్లిప్ తో పాటు బార్ కోడ్ కలిగిన స్లిప్ ను టిడిపి మేనిఫెస్టో ను ఇస్తూ ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తోంది.

    ఓటర్లను ప్రబావితం చేస్తూ బార్ కోడ్ స్లిప్ స్కాన్ చేసిన అనంతరంవారికి ప్రలోభాలకు గురిచేసే విధంగా వ్యవహరిస్తోంది.తమకు అందిన సమాచారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లి ఈమేరకు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది.తెలుగుదేశం పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top