తాడేపల్లి: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలుగు భాష వైభవం, సంప్రదాయాలు, సాహిత్య సంపదను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. మాతృభాష మన గుర్తింపు, మన సంస్కృతికి మూలాధారం అని గుర్తుచేస్తూ, భవిష్యత్ తరాలకు తెలుగు భాషను ప్రేమతో అందించాలనే సందేశాన్ని ఇచ్చారు.