తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నెల 24, 25 తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకునే కార్యక్రమాలతో ఆయన షెడ్యూల్ రూపొందింది. 24.02.2026 (మొదటి రోజు) మంగళవారం సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అక్కడ భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రాత్రికి పులివెందుల నివాసంలో బస చేస్తారు. 25.02.2026 (రెండో రోజు) బుధవారం ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతన నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో మరోసారి ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.