బెంగళూరు: ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్, వైయస్ఆర్‌సీపీ నేత శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం (రాజమహేంద్రవరం) కుమారుడి వివాహ వేడుక బెంగళూరు సిటీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. బెంగళూరు నగరంలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో నాగ ఉమా యజ్ఞిత, యశ్వంత్‌లకు వైయస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవితాన్ని సాఫల్యవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.