వికలాంగ కార్యకర్తకు ఎలక్ట్రిక్ మూడు చక్రాల స్కూటర్ అందజేత

అన్న‌మ‌య్య జిల్లా:  రాజంపేట ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ ఎమ్మెల్యే  గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డిల సహకారంతో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన విక‌లాంగ కార్య‌క‌ర్త‌కు ఎల‌క్ట్రిక్ మూడు చ‌క్రాల స్కూట‌ర్‌ను అంద‌జేశారు. రామాపురం మండలం కల్పనాయుని చెరువు గ్రామం గాలంగుండ్లపల్లెకు చెందిన ఎస్సీ కులానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ కార్యకర్త జనార్దన్‌కు ఎలక్ట్రిక్ మూడు చక్రాల స్కూటర్‌ను శ‌నివారం గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అందజేశారు. పార్టీని ప్రాణంగా భావించే వీరవిధేయుడైన జనార్దన్ గతంలో జరిగిన ప్రమాదంలో ఒక కాలును కోల్పోయారు. ఆ క్లిష్ట సమయంలో అప్పటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ఆయన కుటుంబానికి అండగా నిలిచి బ్యాటరీ ట్రైసైకిల్‌ను అందజేశారు. ఆ ట్రైసైకిల్ ద్వారా జనార్దన్ సమీప ప్రాంతాలకు వెళ్లి తన పనులు నిర్వహించుకునేవారు. ఇప్పుడు ఆయనకు మరింత సౌకర్యం కల్పించేందుకు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిధున్‌రెడ్డి సహకారంతో రూ. లక్షకు పైగా విలువ చేసే ఎలక్ట్రిక్ మూడు చక్రాల స్కూటర్‌ను వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా జనార్దన్‌కు ధైర్యం చెప్పి భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

 కృతజ్ఞతలు తెలిపిన జనార్దన్
ప్రమాదంలో కాలు కోల్పోయిన తనకు అన్ని విధాలుగా అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ప్రస్తుతం ఎలక్ట్రిక్ మూడు చక్రాల స్కూటర్‌ను అందించిన ఎంపీ మిథున్ రెడ్డి లకు జనార్దన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫోన్ ద్వారా ఎంపీ మిథున్ రెడ్డితో మాట్లాడి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. గత వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వంలో రాయచోటి నియోజకవర్గంలో వికలాంగులకు ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో వేలాది మందికి ట్రైసైకిళ్లు, బ్యాటరీ త్రీ వీలర్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు అందజేసిన విషయం గుర్తుచేశారు.  కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగరాణి బాబు, సర్పంచ్ వెంకట్రామి రెడ్డి, నాయకులు చలపతి, శంకర్, శివ, గురుబాబు, నాగరాజు, ఆదిరెడ్డి, బాబిరెడ్డి, చక్రపాణి, కాశీనాయన తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top