

















తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శనివారం ఉదయం నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్‌లో జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని కైకలూరు నియోజకవర్గ కేంద్రంలో తాలూకా ఆఫీస్ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ పార్లమెంట్ పరిధిలోని పిఠాపురం నియోజకవర్గం కేంద్రంలో ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు.