బాపట్ల జిల్లా: పర్చూరు నియోజకవర్గంలోని నాగండ్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విచక్షణారహితంగా చేసిన దాడిలో గాయపడిన బీసీ మహిళలు, చిన్నపిల్లలు,గ్రామస్తులను పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదె మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నపిల్లలపై దాడులు చేయడం అత్యంత అమానుషమని, ప్రజాస్వామ్య సమాజంలో ఇలాంటి దౌర్జన్యాలకు తావులేదని గాదె మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. అధికార బలంతో తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిలబడి పోరాడుతుందని భరోసా ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకొల్లు మండల అధ్యక్షులు చిన్ని పూర్ణరావు, కారంచేడు మండల అధ్యక్షులు జువ్వా శివరామ్ ప్రసాద్, మార్టూరు మండల అధ్యక్షులు జంపని వీరయ్య చౌదరి, పర్చూరు మండల అధ్యక్షులు కఠారి అప్పారావు, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకర్, ఎస్టీ సెల్ నాయకులు మొగిలి నాగేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కొమ్మనబోయిన వాసు, స్టేట్ యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ ఉప్పలపాటి అనిల్ చౌదరి, కొల్లా వెంకట సుబ్బారావు చౌదరి, మార్టూరు టౌన్ ప్రెసిడెంట్ అడక గంగయ్య యాదవ్, నియోజకవర్గ ప్రచార కర్త దాసరి వెంకటరావు, నియోజకవర్గ ఎస్టీ సెల్ నాయకుడు భూక్యా చిన్న నాయక్, యద్దనపూడి హరి ప్రసాద్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, బండి రామయ్య, పాదర్తి ప్రకాశ్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.