ఏపీలో సంపూర్ణంగా మానవ హక్కుల ఉల్లంఘన  

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆదిమూల‌పు సురేష్‌, మేరుగు నాగార్జున మండిపాటు

జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కులు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయని మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్ జస్టిస్ సుబ్రమణ్యం‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు, సాల్మన్ రాజు హత్యకు సంబంధించిన అంశాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ నేతలు తమ రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన వీడియోలు, ఫోటో ఆధారాలను చైర్‌పర్సన్‌కు చూపించినట్లు తెలిపారు. అనంత‌రం పార్టీ నేత‌లు మీడియాతో మాట్లాడారు.

Image

రాజ్యాంగ వ్యవస్థ పనిచేయడం లేదని ఆరోపణ: ఆదిమూల‌పు సురేష్‌
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులపై దాడులు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలోనే జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాం. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై నిజనిర్ధారణ కమిటీని నియమించాలని, డీజీపీ ద్వారా పూర్తి నివేదికను సేకరించాలని కమిషన్‌ను కోరాం.

దళితులపై దాడులు పెరిగాయి: మాజీ మంత్రి మేరుగ నాగార్జున 
రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లపై పెట్రోల్ బాంబులతో దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటనలను కమిషన్‌కు వివరించాం. దళితులపై జరుగుతున్న దాడులను రాష్ట్ర‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

దర్యాప్తుకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ అంగీకారం: వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు
టీడీపీ నేతల దాడులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరాం. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి కమిషన్ చైర్‌పర్సన్ అంగీకరించారు, డీజీపీ ద్వారా నివేదికను సేకరిస్తామని చెప్పారు. త్వరలోనే నిజనిర్ధారణ కమిటీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, ఆటవిక పాలన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని  డిమాండ్ చేశాం.

Back to Top