అనుబంధ గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలి

గొట్లాంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆదేశం
 

గజపతినగరం: బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో ఉన్న సత్య ఫంక్షన్ హాల్‌లో అనుబంధ గ్రామ కమిటీల ఏర్పాటుపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గజపతినగరం మాజీ శాసనసభ్యులు శ్రీ బొత్స అప్పలనరసయ్య హాజరై, అనుబంధ గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని బలంగా నిలబెట్టేందుకు గ్రామ స్థాయి కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రతి గ్రామంలో అనుబంధ కమిటీలను సమన్వయంతో ఏర్పాటు చేసి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తూ పార్టీని గ్రామాల స్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ప్రభూజి రాజు, ఎంపీపీ చల్లా చలం నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల చిన్నమనాయుడు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం విజయవంతంగా కొనసాగగా, పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయడంపై విస్తృతంగా చర్చ జరిగింది.

Back to Top