రాజమండ్రి రూరల్: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా కమిటీల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో వెంకటనగరం, తోర్రేడు, కాతేరు గ్రామాల నాయకులతో రాజమండ్రి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఉప్పులూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు, పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, పార్టీని క్రింది స్థాయి నుంచే బలోపేతం చేయాలన్నదే మన ప్రియతమ నాయకులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన లక్ష్యమని తెలిపారు. గ్రామస్థాయి నుంచే పునాదులను బలపరిచే విధంగా పార్టీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించారని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ కమిటీల్లో భాగస్వామ్యం కల్పిస్తామని, అన్ని వర్గాల నుంచి నాయకులకు పదవుల్లో అవకాశం ఇచ్చి ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారి పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నక్క రాజబాబు, గోందేశీ శ్రీనివాసరెడ్డి, గిరిజాల బాబు, నక్క నగేష్, చెల్లుబోయిన నరేన్, అంగాడ సత్యప్రియ, యెజ్జు శ్రీనివాస్ కిరణ్, పెయ్యాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే తోర్రేడు గ్రామ అధ్యక్షులు చిట్టూరి శ్రీనివాస్, ఉప్పులూరి రాము, చోల్లంగి సత్యగిరి, ఆచంట మారుతి దేవి, చిట్టూరి వెంకట్రావు, దండమూడి అర్జునరావు, ఎరుబండి వెంకట్రావు, సోదదాసి రాహుల్ కుమార్, మెప్పెల్లి రాజు, మోత రమేష్, ఎరుబండి సాయి, కోల్లి వెంకటరత్నం, పెనుమాక సునీల్, నక్కా దానరాజ్, రొంగల వెంకటేష్, మద్దా దుర్గారావు, లాయర్ శ్రీను, కొత్తపల్లి నాగేశ్వరావు, పాస్టర్ విజయ సారధి, పట్టా ఉత్తెజ్, ఉంద్రజవరపు సూర్య, దేవమాత, దిలీప్, చీకట్ల రంజిత్, వీణం దేవి, ఎండీ మున్నిసా తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.