సేవాలాల్ మహారాజ్ కృషి చిర‌స్మ‌ర‌ణీయం

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి

బ‌న‌గాన‌ప‌ల్లెలో ఘ‌నంగా సేవాలాల్ 287వ జయంతి వేడుక‌లు

నంద్యాల జిల్లా : బంజారా జాతి ఆరాధ్య దైవం, మహనీయ సంఘ సంస్కర్త సేవాలాల్ మ‌హారాజ్ 287వ జయంతి వేడుకలను బనగానపల్లెలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ బంజారా జాతిని సన్మార్గంలో నడిపిస్తూ సామాజిక చైతన్యం కలిగించిన మహనీయుడని ఆయన అన్నారు. సమాజంలో సమానత్వం, నీతి, న్యాయం విలువలను ప్రోత్సహిస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడిగా సేవాలాల్ మహారాజ్ నిలిచారని కొనియాడారు. బంజారా జాతి ఐక్యతకు ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 

కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాండ్లావత్ శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి ఈశ్వర్ నాయక్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దండు మధుబాబు, ఎస్ లక్ష్మానాయక్, రాముడు నాయక్, రాజునాయక్, రాజా నాయక్, చంద్ర నాయక్, తౌరే నాయక్, సక్రు నాయక్, కంబగిరి రాముడు నాయక్, సొమ్లా నాయక్, మనోహర్ నాయక్, రామోజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.  

Back to Top