అరెస్టుల‌తో ప్ర‌శ్నించే గొంతుల‌ను ఆప‌లేరు 

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి

అంబ‌టి కుటుంబ స‌భ్యుల‌కు యువ‌నేత ప‌రామ‌ర్శ  

గుంటూరు:  అక్ర‌మ కేసుల‌తో అరెస్టు చేసి ఇబ్బంది పెట్టినంత‌మాత్రాన ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం మూర్ఖత్వమని వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు న‌గ‌రంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంస‌మైన అంబటి ఇంటిని బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్టులతో ప్రశ్నించే గొంతులను ఎప్పటికీ ఆపలేరని స్పష్టం చేశారు. అంబటి రాంబాబు పై నమోదైన కేసులు, అరెస్టులు రాజకీయ కక్షసాధింపేనని ఆరోపించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజల కోసం ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించిన నాయకుడిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. 

Back to Top