మోసానికి షర్ట్, ప్యాంట్‌ వేస్తే అది చంద్రబాబు

అబద్ధానికి రెక్కలు తొడిగితే చంద్రబాబు మాటలు

శ్రీ వైయస్‌ జగన్‌ ఫైర్‌

ప్రతి బడ్జెట్‌లోనూ ప్రజలకు వంచన, మోసం

ఈ ఏడాది బడ్జెట్‌లోనూ తప్పుడు గణాంకాలు

మొత్తం కాకి లెక్కలు. పూర్తిగా అవాస్తవాలు

తేల్చి చెప్పిన శ్రీ వైయస్‌ జగన్‌ 

వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

రాష్ట్ర వార్షిక బడ్జెట్, తిరుపతి లడ్డూ. ఇందాపూర్‌ డెయిరీ హెరిటేజ్‌ లింక్‌  అంశాలపై మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌.

చంద్రబాబుది ఆర్థిక అస్తవ్యస్త నిర్వహణ

రాష్ట్ర అప్పులపై పదే పదే అవే అబద్ధాలు

ఆదాయంలో దారుణ స్థితిలో మన రాష్ట్రం

‘కాగ్‌’ రిపోర్ట్‌ ప్రకారం దేశంలో 22వ స్థానం

శ్రీ వైయస్‌ జగన్‌ ధ్వజం

ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు

ఇంటింటికీ బాండ్లు పంపి పచ్చి మోసం

ఏదీ అమలు చేయకుండా వంచన, దగా

ఉద్యోగులకు కూడా భారీ మోసం

రెండేళ్లుగా ఉద్యోగుల జీతాలు పెరగలేదు

ఐఆర్‌ లేదు. పీఆర్సీ ప్రస్తావనే లేదు

చంద్రబాబు హ్యాబిట్యువల్‌ అఫెండర్‌

ఆయనకు మోసాలు కొత్త కానే కాదు

శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ అట్టర్‌ఫ్లాప్‌

అయినా నిస్సిగ్గుగా గోబెల్స్‌ ప్రచారం

సూపర్‌హిట్‌ అంటూ సభలు, వేడుకలు

ఉద్దేశపూర్వకంగా వ్యవసాయ రంగం నిర్వీర్యం

వ్యవసాయం కుదేలు. రైతుల ఆత్మహత్యలు

చంద్రబాబుది మ్యాన్‌ మేడ్‌ మిస్టేక్‌

గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్‌

ఇందాపూర్, హెరిటేజ్‌ అసలు రహస్యం ఇదే

ఇందాపూర్‌ పేరుతో హెరిటేజ్‌కు ప్రయోజనం

ఏకంగా కిలో నెయ్యి ధర రూ.658కి పెంపు

భోలేబాబా డెయిరీని తెచ్చిందే చంద్రబాబు

ఆధారాలతో సహా చూపిన శ్రీ వైయస్‌ జగన్‌

వైయస్సార్‌గారి హయాంలోనే తిరుమలపై జీఓ

తిరుమలను ఏడు కొండలుగా నోటిఫై చేసింది ఆయనే

అక్కడ అన్యమత ప్రచారాలూ నిషేధించింది ఆయనే

ఆ మేరకు రెండు జీఓలు జారీ చేసిన వైయస్సార్‌ ప్రభుత్వం

తాము అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తానన్న చంద్రబాబు

వీడియోతో సహా చురకలంటించిన శ్రీ వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ‘మోసానికి షర్ట్, ప్యాంట్‌ వేస్తే అది చంద్రబాబు.. అబద్ధానికి రెక్కలు తొడిగితే అవి చంద్రబాబు మాటలు’.. అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రతి బడ్జెట్‌లోనూ ప్రజలకు వంచన, మోసమే అని, ఈ ఏడాది బడ్జెట్‌లోనూ అన్నీ తప్పుడు గణాంకాలు, మొత్తం కాకి లెక్కలు. పూర్తిగా అవాస్తవాలే అని  శ్రీ వైయస్‌ జగన్‌ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబుది ఆర్థిక అస్తవ్యస్త నిర్వహణ అన్న ఆయన, రాష్ట్ర అప్పులపై పదే పదే అవే అబద్ధాలు చెబుతున్నారని, ఆదాయంలో దారుణ స్థితిలో మన రాష్ట్రం ఉందని, ‘కాగ్‌’ రిపోర్ట్‌ ప్రకారం దేశంలో 22వ స్థానం నిల్చిందని శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు.
    ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇంటింటికీ బాండ్లు పంపి పచ్చి మోసం చేశారని, వాటిలో ఏదీ అమలు చేయకుండా వంచన, దగా చేశారని, చివరకు ఉద్యోగులకు కూడా భారీ మోసం చేశారని, రెండేళ్లుగా ఉద్యోగుల జీతాలు పెరగలేదని, వారికి ఐఆర్‌ ఇవ్వలేదని, పీఆర్సీ ప్రస్తావనే లేదని గుర్తు చేశారు.
    ‘చంద్రబాబు హ్యాబిట్యువల్‌ అఫెండర్‌’ అన్న శ్రీ వైయస్‌ జగన్, ఆయనకు మోసాలు కొత్త కానే కాదని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తేల్చి చెప్పారు.
    రాష్ట్ర వార్షిక బడ్జెట్, తిరుపతి లడ్డూ. ఇందాపూర్‌ డెయిరీ హెరిటేజ్‌ లింక్‌ అంశాలపై మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్, ఇంకా ఏమన్నారంటే..:

ప్రతి బడ్జెట్‌లోనూ వంచన. మోసం:
    సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా కూడా ఐదు బడ్జెట్‌లు ఉంటాయి. ఆ అవకాశాన్ని ప్రజలు ఏ ప్రభుత్వానికైనా ఇస్తారు. ఈ చంద్రబాబునాయుడుగారి ప్రజా వ్యతిరేక వెన్నుపోటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దీంతో ఇంకా రెండు బడ్జెట్లు మాత్రమే మిగిలాయి. ఈ మూడు బడ్జెట్ల ద్వారా చంద్రబాబుగారు రాష్ట్రానికి,  ప్రజలకు ఏం మంచి చేశారని, చేస్తారని పరిశీలిస్తే ఎక్కడా మంచి కనపడదు. మోసమే కనిపిస్తుంది. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ, వారిని వంచిస్తున్నారు.

మోసానికి ప్యాంట్, షర్ట్‌ తొడిగితే చంద్రబాబు:
    ఈ బడ్జెట్‌లోనూ చంద్రబాబు తాను ఇస్తానన్న సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌తో పాటు, మ్యానిఫెస్టో హామీలు పూర్తిగా గాలికెగిరిపోయాయి. అన్ని వర్గాలనూ మోసం చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ విషయంలో ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి, అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలను నెరవేర్చకపోయినా పదే పదే అబద్ధాలు చెబుతూ.. సూపర్‌ హిట్‌ అంటూ నిస్సిగ్గుగా గోబెల్స్‌ ప్రచారానికి దిగారు.
    ‘మోసానికి షర్టూ, ప్యాంటూ వేస్తే చంద్రబాబు అవుతాడు’. అలాగే అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా అవే పచ్చి అబద్ధాలు. తప్పుడు లెక్కలు. లేని గొప్పలు. చంద్రబాబు భజన కనిపిస్తున్నాయి.

పబ్లిసిటీ పీక్‌. పర్ఫార్మెన్స్‌ వీక్‌:
    రాష్ట్ర ప్రగతి గురించి. ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి. వాస్తవ లెక్కలు చూస్తే అవి గడప కూడా దాటని పరిస్థితులు కనపడతాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్‌. ఫెర్ఫార్మెన్స్‌ వీక్‌. ఇదే చంద్రబాబు పాలనలో స్టాండర్డ్‌గా కనిపించే సత్యం.
    2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జీఎస్‌డీపీ 11.75 శాతంగా చంద్రబాబు చెబుతూ వచ్చారు. అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 9.8 శాతం మాత్రమేనని ఆయన తన ఆఫీసులో కూర్చుని అంకెలు రాసేస్తారు. అదే విధంగా 2025–26కు సంబంధించి రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్‌ రేట్‌ 10.75 శాతంగా గొప్పలు చెప్పుకుంటారు. అదే సమయంలో దేశ జీడీపీ గ్రోత్‌ రేట్‌ 8 శాతమే. మరి రాష్ట్రంలో గ్రోత్‌ రేట్‌ 10.75 శాతంగా నమోదైందని చంద్రబాబుగారు తన డబ్బాను తానే కొట్టుకుంటున్నారు. ఫ్యాబ్రికేటెడ్‌ నంబర్లతో తన డప్పు తానే కొట్టుకోవడం మనందరికీ కనిపిస్తుంది. 

ఒకవేళ ఆ గణాంకాలే వాస్తవమైతే..?:
    నేను ఒకటే అడుగుతున్నా. జీడీపీ, రాష్ట్ర వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉంటే, నిజంగా రాష్ట్రం పురోగతిలో ఉందని అర్థం. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టార్లు పురోగతి సాధిస్తున్నాయని దాని అర్థం. వ్యవసాయ, పారిశ్రామిక, తయారీ, సేవల రంగాలన్నీ చాలా వేగంగా పరిగెడుతున్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలే నిజమైతే, జీఎస్‌డీపీలో గ్రోత్‌ రేట్‌ ఈ రకంగా ఉంటే, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా నిజంగా ఇదే రీతిలో పెరిగి ఉండాలి కదా? ప్రజల ఆదాయాలు పెరిగి ఉంటే వారి కొనుగోలు శక్తి కూడా పెరగాలి కదా?. తద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం కూడా పెరిగి ఉండాలి కదా?. ఇదంతా సైక్లికల్‌ కదా?. కానీ అది జరిగిందా?.

వాస్తవ ఆదాయాలు. గణాంకాలు పరిశీలిస్తే..:
    2024–25లో చంద్రబాబుగారి మొదటి సంవత్సరం. రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయం రూ.1,19,927 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో చెప్పారు. కానీ ఆ ఏడాది రాష్ట్రానికి నికరంగా వచ్చిన ఆదాయం కేవలం రూ.95,407 కోట్లు. అదే అంతకు ముందు ఏడాది, 2023–24లో అంటే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ చివరి ఏడాదిలో రాష్ట్ర సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌) రూ.93,354 కోట్లు. అంటే పెరుగుదల కేవలం 2.2 శాతం మాత్రమే. అలా, ఆ బడ్జెట్‌లో చంద్రబాబు లెక్కలు వేసిన రూ.1,19,927 కోట్లు గాలికెగిరిపోయాయి. 
    ఇక 2025–26లో కూడా బడ్జెట్‌ గారడీ చేస్తూ రాష్ట్ర సొంత ఆదాయాన్ని రూ.1,27,703 కోట్లుగా ప్రొజెక్టు చేశారు. కానీ ఈ జనవరి, ఫిబ్రవరి వరకు లెక్కేసుకుంటే, కాగ్‌ నివేదికల ప్రకారం çఈ పది నెలల్లో రాష్ట్రానికి వచ్చిన నికర ఆదాయం రూ.75,964 కోట్లు మాత్రమే. అదే గత ఏడాది.. 2024–25లో 10 నెలల్లో వచ్చిన ఆదాయం రూ.72,864 కోట్లు. అంటే పెరుగుదల కేవలం 4.25 శాతం. 
    మరి చంద్రబాబుగారు ప్రొజెక్ట్‌ చేసిన రూ.1,27,703 కోట్ల ఆదాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సవరించినా, వాస్తవం చాలా దూరంలో ఉంది. ఈ ఏడాది బడ్జెట్‌ రివైజ్డ్‌ ఎస్టిమేట్‌లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,12,349 కోట్లుగా చెప్పారు. మరి 10 నెలల్లో కేవలం రూ.75,964 కోట్లు వస్తే, మిగిలిన ఉన్న 2 నెలల్లో అది ఏకంగా రూ.1,12,349 కోట్లకు ఎగబాకుతుందా? ప్రభుత్వం ఆశించినట్లు ఈ రెండు నెలల్లో రూ.36,385 కోట్లు వస్తాయా? అంటే ఈ ఫిబ్రవరి, మార్చిలో రూ18,224 కోట్ల చొప్పున ఆదాయం వస్తుందా? ఆ ప్రకారం 139 శాతం ఎస్‌ఓఆర్‌ రావాలి. ఇది అంకెల గారడీ కాక మరేమిటి? ప్రజలను తప్పుదోవ పట్టించడమే కదా?.
    నాకు తెలిసినంత వరకు ఈ పది నెలల కాలానికి రూ.75,964 కోట్లు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో మిగిలి ఉన్న రెండు నెలలు కాలంతో కలిపి మొత్తం రూ.95 వేల కోట్లు వస్తే గొప్ప. 
    కానీ, ఈ పెద్ద మనిషి మళ్లీ 2026–27 వచ్చే సరికి ఏం చెబుతున్నాడు! రాష్ట్ర సొంత ఆదాయాన్ని (ఎస్‌ఓఆర్‌) ఏకంగా రూ.1,37,320 కోట్లుగా చూపుతున్నారు. అంటే అది ఏకంగా 45 శాతం పెరుగుదల. అది సాధ్యమేనా?. గత బడ్జెట్‌లో కూడా ఇలాగే చూపిస్తే, వచ్చిన వృద్ధి రేటు కేవలం 3.4 శాతం మాత్రమే.
    ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 2025–26లో మొదటి 9 నెలల పన్నుల ఆదాయాన్ని, 2023–24 మా చివరి ఏడాదితో పోలిస్తే.. ఈ రెండేళ్లకు సంబంధించిన సీఏజీఆర్‌ (వార్షిక వృద్ధి రేటు) కేవలం 1.97 శాతం మాత్రమే.

ఆదాయంలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్‌:
    ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కాగ్‌ డేటాను ఈ మధ్య కాలంలోనే అప్‌లోడ్‌ చేశారు. 23 రాష్ట్రాలున్న దేశంలో చంద్రబాబునాయుడు పరిపాలనలో ఉన్న మన రాష్ట్రం పరిస్థితి ఏమిటంటే, మనం 22వ స్థానంలో ఉన్నాం. అంటే చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నాం. అంటే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సొంత ఆదాయాలు, 2023–24 నుంచి ఇప్పటి వరకు రెండేళ్ల 9 నెలల్లో పెరుగుదల కేవలం 1.97 శాతం మాత్రమే. అలా దేశంలో అట్టడుగున 22వ స్థానంలో ఉన్నాం. చంద్రబాబునాయుడుగారి అసమర్థత, ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా?.
    సొంత ఆదాయాల విషయంలో రాష్ట్రాలతో పోల్చినా లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే 9.64 శాతం పురోగతి ఉంటే, మన రాష్ట్ర పురోగతి 1.97 శాతమే. అంటే మిగతా రాష్ట్రాలకు కనీసం దరిదాపుల్లో కూడా లేం. కానీ చంద్రబాబు ఏమంటారు? జీఎస్డీపీలో మనం దూసుకుపోతున్నాం. దేశంకన్నా ఇంకా పైస్థానంలో ఉన్నాం అంటాడు. 2024–25లో 11.75 శాతంతో దూసుకుపోతున్నాం. దేశం ఎంత 9.8 శాతమే అంటాడు. మళ్లా ఏమంటాడు 2025–26లో రాష్ట్రం 10.75 శాతంతో దూసుకుపోతున్నాం. దేశం ఎంత కేవలం 8 శాతంతో ఉంది అంటాడు. మనం కేవలం 1.97 శాతం వృద్ధిరేటుతో ఉంటే, జీఎస్డీపీ వృద్ది రేటు ఆయన చెప్పినట్లు ఏకంగా 11.75 శాతం, 10.75 శాతం ఏరకంగా నమోదవుతుంది? ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నాడు ఈ మనిషి?.

అంతా దోచుకో.తినుకో.పంచుకో:
    అసలు చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడం లేదు. రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి. పెరుగుదల మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడం లేదు? కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. పక్క దోవ పట్టి చంద్రబాబునాయుడి జేబులోకి ఇంత, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఇంత, బినామీలకు ఇంత.. అందరూ పంచుకుంటున్నారు. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా. 
    రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక, మట్టి, లిక్కర్, లేటరైట్, గ్రానైట్, లిక్కర్‌ మాఫియా. అంతా ఎక్కడికక్కడ దోపిడి. ప్రభుత్వ భూములు ఎడాపెడా నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఎడాపెడా అమ్మే పరిస్థితి. ఇలా వనరులన్నింటినీ దోచేస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రావడం లేదు. 

ప్రత్యేక విమానాలు. జల్సాలు:
    మరోవైపు చూస్తే ఆయనొక (చంద్రబాబు) విమానం. ప్రత్యేక విమానంతో పాటు ఒక హెలికాప్టర్‌. ఆయన కొడుక్కో విమానం, హెలికాప్టర్‌. ఆ తర్వాత ఆయనకు మద్దతిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌గారికి ఒక విమానం, ఒక హెలికాప్టర్‌. అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రిగారి కొడుకు ఒకపూట విజయవాడలో ఉంటే మరోపూట హైదరాబాద్‌లో ఉంటారు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్‌ మ్యాచ్‌ కోసం పక్క దేశం వెళ్లి కొలంబోలో మ్యాచ్‌ చూస్తాడు రాత్రికి. మరుసటిరోజు ఉదయం విజయవాడలో ఉంటాడు. మళ్లీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతా ప్రైవేట్‌ విమానాలే.
    దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్లు ఇలా జల్సాలు, సంబరాలు చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్‌ ఆడుతుంటే ఈయనేం స్వామీ నాకు అర్థం కావడం లేదు. ప్రైవేట్‌ ఫ్లైట్‌లో కొలంబోకు పోయి మ్యాచ్‌ చూస్తాడు. క్రికెట్‌ అభిమానివే అనుకో. టీవీలో చూస్తే కనపడదా?.

రాష్ట్ర అప్పులపై అవే గోబెల్స్‌ ప్రచారం:
    రాష్ట్ర అప్పుల విషయానికి వస్తే మళ్లీ అవే గోబెల్స్‌ ప్రచారాలు. చంద్రబాబునాయుడుగారి నైజం నిజంగా కుక్కతోక వంకరే. ఎన్నిసార్లు మనం చెప్పినా, ఎందుకయ్యా అబద్ధాలు చెబుతావు, వాస్తవాలు ఇవీ ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్లు ఇచ్చినా, సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినా అవే గోబెల్స్‌ ప్రచారాలు, అవే అబద్ధాలు. కుక్కతోక కూడా మీరు గమనించే ఉంటారు. దాన్ని కరెక్ట్‌ చేయడానికి ఇలా చేయండి అది మళ్లీ వెనక్కి వెళ్లిపోతుంది. అందుకే సామెత కూడా అంటారు కుక్కతోక వంకర అని. చంద్రబాబునాయుడుగారు కూడా అంతే. 
    మొన్నటి బడ్జెట్లో కూడా ఏకంగా రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మేం మిగిల్చాం అంటారు. అసలు నిజాలేంటో తెలుస్తాయని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు రాష్ట్ర ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందో అని ఏకంగా బడ్జెట్‌ పేపర్స్‌లో అప్పులకు సంబంధించిన టేబుల్‌ వాల్యూమ్‌ నంబర్‌–6 బుక్‌లో ఉంటుంది. దాన్ని పూర్తిగా ఎత్తేశారు. 
    నేను చంద్రబాబును ఒక్కటే అడుగుతా. అయ్యా చంద్రబాబూ.. ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ, మీరే, ప్రజెంట్‌ చేసిన మీ తొలి బడ్జెట్‌.  అప్పటికి ఇంకా ఇన్ని తెలివితేటలు ముదరలేదు. 2024–25 బడ్జెట్‌ డాక్యుమెంట్స్‌లోనే క్లియర్‌గా రాష్ట్రానికి అప్పులెంత ఉన్నాయనేది రాశారు.
    ఇంకా ఆ విషయం 2023–24 కాగ్‌ నివేదికలో కూడా కనిపిస్తుంది. మన హయాం చివరికి అంటే 2023–24 వరకు చూస్తే రాష్ట్ర అప్పు రూ.4,91,734 కోట్లుగా కనిపిస్తుంది. తర్వాత స్టేట్‌ గవర్నమెంట్‌ గ్యారెంటీస్‌ ఔట్‌ స్టాండింగ్స్‌ మరో రూ.1,54,797 కోట్లు. రెండూ కలిపితే వైయస్సార్‌ సీపీ హయాం ముగిసే నాటికి ఎంత అప్పు అనేది క్లియర్‌గా ఉంటుంది. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటికి, చంద్రబాబు హయాం ముగిసే నాటికి, రాష్ట్ర అప్పు రూ.3,90,247 కోట్లు.

ఎవరి హయాంలో ఎంతెంత అప్పు?:
    ఒక్కసారి అంతకు ముందు చూస్తే.. రాష్ట్ర విభజన తర్వాత 2014 వరకు అన్ని రకాల అప్పులు చూస్తే రూ.1,40,717 కోట్లు కాగా, 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి అవి రూ.3,90,247 కోట్లకు ఎగబాకాయి. అంటే చంద్రబాబు తన హయాంలో 2014–19 మధ్య రూ.2,49,350 కోట్లు అప్పు చేశాడు. అంటే అప్పుల ఏటా వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్‌) 22.63 శాతంతో ఆయన అప్పు చేశారు.
    ఇక మా ప్రభుత్వంలో రూ.3,90,247 కోట్ల అప్పు నుంచి మేం స్టార్ట్‌ అయితే.. మేము దిగిపోయే నాటికి ఉన్న మొత్తం అప్పు రూ.7,21,917 కోట్లు. అంటే మా హయాంలో చేసిన అప్పు రూ.3,31,670 కోట్లు. మా ప్రభుత్వంలో అప్పుల సీఏజీఆర్‌ కేవలం 13.09 శాతమే. ఇది కాగ్‌ లెక్కలు, స్టేట్‌ గవర్నమెంట్‌ లెక్కలు, బడ్జెట్‌ డాక్యుమెంట్లలో అన్నింటిలో స్పష్టంగా కనిపిస్తుంది.
    కానీ చంద్రబాబునాయుడు మాత్రం టేప్‌ రికార్డర్‌ ఆన్‌.. గోబెల్స్‌ ప్రచారం ఆన్‌. అన్ని రకాల అప్పులూ రాష్ట్రంలో మేం దిగిపోయే నాటికి రూ.7,21,917 కోట్లే కనిపిస్తుంటే.. నిన్న కూడా మాకు అప్పు ఇంత మిగిల్చి పోయారు రూ.9.74 లక్షల కోట్లు అని మళ్లీ అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకు అబద్ధాలు అలా. తప్పు కదా? అబద్ధాలు ఆడటం మోసం చేయడం. బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు బాధ్యత తీసుకుని నిజాలు చెప్పాలి తప్ప బాధ్యత గల స్థానంలో ఉండి ఇలా అబద్ధాలు ఆడటం ఎంతమటుకు కరెక్టు?.

20 నెలల్లో రికార్డుస్థాయిలో అప్పు. పారదర్శకత లేదు:
    ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన అప్పులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లోనే చేసిన అప్పు ఏకంగా రూ.3,17,448 కోట్లు. మేము 5 ఏళ్లలో రూ.3,31,671 కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు 20 నెలల్లోనే రూ.3,17,448 కోట్ల అప్పు చేశారు.
    వాస్తవాలన్నీ ఆధారాలతో సహా కనిపిస్తున్నా కూడా ఇంకా వాళ్లు బడ్జెట్‌ డాక్యుమెంట్స్‌తో ఇంకా గేమ్‌ ఆడుతూనే ఉంటారు. చివరికి బడ్జెట్‌ డాక్యుమెంట్లో చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా పారదర్శకంగా చూపించడం లేదు.
    2025–26లో మొదటి 10 నెలల్లో చేసిన బడ్జెట్‌ అప్పులు చూస్తేనే రూ.90,768 కోట్లు. ఇంకా చివరి రెండు నెలలు ఇంకా ఉన్నాయి. అయినా అప్పులు చేస్తూనే ఉన్నారు. కానీ బడ్జెట్‌ పుస్తకాలు చూస్తే 2025–26 ఆర్థిక సంవత్సరానికి వీళ్లు సవరించిన ఎస్టిమేట్స్‌ 12 నెలలకు అప్పు ఎంత చూపించారో తెలుసా? కేవలం రూ.80,567 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. నిజానికి కాగ్‌ లెక్కల ప్రకారమే రూ.90,768 కోట్లు అప్పు చేశారు. 2025–26లో 12 నెలలకు కలిపి ఇంకా రెండు నెలలు ఉన్నాయి. అప్పు రూ.10 వేల కోట్లు తగ్గించి, రూ.80,567 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? అప్పులు వీళ్లు పారదర్శకంగా చూపించడం లేదు. ఎక్కడికక్కడ అడ్జస్ట్‌ చేస్తున్నారు. 

ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలు:
    ఉద్యోగులకు సంబంధించిన డబ్బు ఇష్టమొచ్చినట్టు ఎడాపెడా వాడేస్తున్నారు. ఒకవైపున వారికి ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. రూ.35 వేల కోట్లు వాళ్లకు బకాయిలు, జీతాలు పెంచేది లేదు. మరోవైపున వాళ్ల జీతాలతో, వాళ్ల అకౌంట్స్‌ తో వీళ్లు గేమ్‌ ఆడుతున్నారు. ఐఆర్‌ లేదు. పీఆర్సీ ప్రస్తావన లేదు.

మూలధన వ్యయం. వాస్తవాలకు దూరం:
    మూలధన వ్యయం వాస్తవాలకు దూరంగా ఉంది. మూలధన వ్యయం కింద 2025–26లో గమనిస్తే బడ్జెట్లో చూపించింది రూ.40,635 కోట్లు. మళ్లీ రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌లో రూ.33,135 కోట్లు అని చెప్పారు. కానీ, ఈ 10 నెలల్లో వీళ్లు ఖర్చు పెట్టింది కేవలం రూ.21,675 కోట్లు మాత్రమే. అలాగే గత ఏడాది చూస్తే.. 2014–25లో మూలధన వ్యయాన్ని రూ.32,714 కోట్లుగా చూపారు. ఆ తర్వాత రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌లో దాన్ని రూ.24,072 కోట్లకు తగ్గించారు. చివరకు వారు ఖర్చు చేసింది కేవలం రూ.16,141 మాత్రమే.
    రాష్ట్ర సొంత ఆదాయాల విషయంలో అయితేనేమి, మూలధన వ్యయంలో అయితే ఏమి.. అంతా మోసం మోసం. ఇక ఈ బడ్జెట్‌లో 2026–27లో మూలధన వ్యయాన్ని ఏకంగా రూ.48,097 కోట్లుగా చూపారు. కానీ, ఎంత ఖర్చు చేస్తారనేది చూడాలి.
    చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన బిల్డప్‌ ఏమిటి అంటే.. తాను సీనియర్‌ అని అని, సంపద çసృష్టిస్తానని, అప్పుల మీద ఆధారపడే పరిస్థితి రాకుండా చేస్తానని కబుర్లు చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏంటి అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తున్నాడు. ఆల్‌ టైమ్‌ రికార్డులన్నీ బద్ధలు కొడుతున్నాడు. కానీ ప్రజలకు ఎలాంటి స్కీములు లేవు. ఉన్న స్కీములన్నీ రద్దు. సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు మోసాలు. 

మ్యానిఫెస్టోలో ప్రతి మాట నిలబెట్టుకున్నాం:
    మేనిఫెస్టో అన్నది ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు. మా హయాంలో మొట్టమొదటిసారిగా రిఫార్మ్‌ తీసుకొచ్చాం. మ్యానిఫెస్టో ద్వారా ప్రజలకిచ్చే హామీలు నీటిమీద రాతలు కాకూడదని, అవి మోసాలుగా మిగిలిపోకూడదు అని, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాలని, నిజంగా కోవిడ్‌ లాంటి మహా సంక్షోభం ఉన్నా కూడా మా ప్రభుత్వంలో మనసా, వాచా కర్మణా మ్యానిఫెస్టో అన్నది అమలు చేసి ఒక పవిత్రతను తీసుకొచ్చాం. ఏకంగా 99 శాతం హామీలు నెరవేర్చి, ప్రజల దగ్గరికి గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్లగలిగే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి తీసుకొచ్చింది ఒక్క మా హయాంలో. 

చంద్రబాబుకు మ్యానిఫెస్టో ఒక చిత్తు కాగితం.
ఇంటింటికీ బాండ్లతో పచ్చి మోసం:
    అలాంటి చిత్తశుద్ధి మేం చూపిస్తే.. మేనిఫెస్టో అనే పదానికి అర్థం చెబుతూ.. చంద్రబాబు తన మేనిఫెస్టోకు ఇచ్చిన విలువ ఏంటో తెలుసా? ఇంతకు ముందు ఆయన పెట్టిరెండు బడ్జెట్లు చూసినా, ఇప్పుడు ఆయన పెడుతున్న మూడో బడ్జెట్‌ చూసినా మేనిఫెస్టో అంటే తనకు ఎప్పటికీ కూడా చిత్తు కాగితమే అని రుజువు చేస్తున్నాడు చంద్రబాబు.
    ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంటింటికీ వెళ్లి బాండ్లు పంచాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ పథకానికి ఎంతెంత వస్తుందో కూడా లెక్కలేసి చూపించి మరీ ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ప్రతీ కుటుంబాన్ని కూడా మోసం చేస్తున్నాడు. ఎన్నికల మేనిఫెస్టోల గురించి సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవెన్‌లు అంటూ వారి కరపత్రికల్లో ఒకటే యాడ్లు ఇచ్చారు. ప్రజలను మోసం చేసేందుకు మాఫియా ముఠా మొత్తం ఒక్కటై ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను మోసం చేశారు.
    బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువగళం పేరుతో ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు.. అని చెప్పడమే కాకుండా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల ఫొటోలతో బాండ్లు ఇచ్చి వాటిపై సంతకాలు పెట్టి వారి చేతిలో పెట్టారు. పీఎం కిసాన్‌తో కలిపి రైతుకు ఏడాదికి రూ.26 వేలు ఇస్తామని ఊదరగొట్టారు. 

త్రికరణ శుద్ధితో పచ్చి మోసం:
    ఇదంతా కాకుండా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ త్రికరణ శుద్ధితో ప్రమాణం చేశారు. ఎలాంటి నియమ నిబంధనలు విధించకుండా లబ్ధిదారులందరికీ పథకాలు వర్తింప చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ సంతకాలు చేసిన బాండ్లు పంపించారు. ప్రతి ఇంటికీ త్రికరణ శుద్ధితో పంపిణీ చేశారు.

Back to Top