వేరే మ‌తాల్లోనైతే.. చంద్ర‌బాబుని బ‌హిష్కరించేవారు 

ముస్లిం, క్రిస్టియ‌న్‌గా పుట్టుంటే ఎప్పుడో మ‌త బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యేవాడు

స్ప‌ష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి

చంద్ర‌బాబుకి దేవుడంటే భ‌యం, భ‌క్తి లేనే లేవు 

రాజ‌కీయ అవ‌స‌రాలకే చంద్ర‌బాబుకి కులం, మ‌తం కావాలి

హిందూ మ‌తానికి చంద్ర‌బాబు తీర‌ని ద్రోహం చేస్తున్నాడు 

బీజేపీ చెంత‌న చేరిన‌ప్పుడే హిందువుల భ‌జ‌న చేస్తాడు

బీజేపీ నాయ‌కులు బుద్ధి చెప్పాలి లేదా వ‌దిలించుకోవాలి

నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి సూచ‌న 

వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేయ‌డంలో చంద్ర‌బాబు దిట్ట‌

వైయ‌స్ జ‌గ‌న్‌ని రాజ‌కీయంగా ఎదుర్కోలేక క‌ల్తీ నెయ్యి పేరుతో కుట్ర 

ఇందాపూర్ ముసుగులో టీటీడీ నిధులు హెరిటేజ్ కి దోచిపెట్టాడు

ఆయ‌న అవినీతి బ‌య‌టప‌డ్డాక మ‌త రాజ‌కీయాలు మొద‌లుపెట్టాడు

కావాల‌నే వైవీ సుబ్బారెడ్డి, భూమ‌న కుటుంబాల‌పై క్రిస్టియ‌న్ ఆరోప‌ణ‌లు 

తాను చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాల‌ని తెలిసే చంద్ర‌బాబు బుర‌దజ‌ల్లాడు 

ఇన్ని దుర్మార్గాలు చేస్తున్న చంద్ర‌బాబుని దేవుడు క‌ఠినంగా శిక్షిస్తాడు

చంద్ర‌బాబు రాజ‌కీయ ఉన్మాదిలా మారిపోయాడ‌ని ల‌క్ష్మీ పార్వ‌తి ఆగ్ర‌హం

తాడేప‌ల్లి: హిందూ మ‌తానికి చంద్ర‌బాబు తీర‌ని ద్రోహం చేస్తున్నాడ‌ని, ఆయ‌న ముస్లింగానో లేదా క్రిస్టియ‌న్‌గానో పుట్టి ఉంటే ఈపాటికి ఆ మ‌తాల్లో నుంచి చంద్ర‌బాబు బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యేవాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి స్ప‌ష్టం చేశారు. తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేవుడి మీద విష ప్ర‌చారం చేస్తూ హిందూ మ‌త విశ్వాసాల‌ను నాశ‌నం చేస్తున్న చంద్ర‌బాబుకి బీజేపీ నాయ‌కులు బుద్ధి చెప్ప‌డ‌మో లేదా ఆయ‌న్ను వ‌దిలించుకోవ‌డ‌మో చేయాల‌ని సూచించారు. చంద్ర‌బాబుకి దేవుడంటే భ‌యం కానీ, భ‌క్తి కానీ లేనే లేవ‌ని.. భ‌యభ‌క్తులు ఉన్న‌వారు ఇంత నీచంగా తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం గురించి విష ప్ర‌చారం చేయ‌ర‌ని మండిప‌డ్డారు. త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం చంద్ర‌బాబు ఉన్నాదిలా మారిపోయి కుల మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నాడ‌ని చెప్పారు. తాను చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాల‌ని తెలిసే వైవీ సుబ్బారెడ్డి, భూమ‌న కుటుంబాల‌పై క్రిస్టియ‌న్ ఆరోప‌ణ‌లు చేశాడ‌ని నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి స్ప‌ష్టం చేశారు. 
ఆమె ఇంకా ఏమ‌న్నారంటే... 

● కుల‌మ‌తాల‌తో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ 

చంద్ర‌బాబు త‌న పాల‌నా వైఫల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు కుల‌మ‌తాల‌ను వాడుకుంటూ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం క‌ల్తీ నెయ్యి పేరుతో తిరుమ‌ల శ్రీవారిని రాజ‌కీయాల్లోకి లాగి ఆల‌య ప్ర‌తిష్టను మ‌స‌క‌బార్చేస్తున్నాడు. త‌న కుటుంబ సంస్థ హెరిటేజ్‌కి టీటీడీ నిధులు దోచిపెట్టాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఆధారాలు చూపించ‌డంతో వాటికి స‌మాధానం చెప్పుకోలేక కుల‌మ‌త రాజ‌కీయాల‌తో ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్నాడు. అన్న‌ద‌మ్ముల్లా క‌లిసుంటున్న ఆంధ్ర ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టడానికి పూనుకుంటున్నాడు. చంద్ర‌బాబుకి దైవ‌భక్తి అనేది లేదు. 1995లో తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన‌ప్పుడే త‌న‌కు ఏ దేవుడు మీదా న‌మ్మ‌కం లేద‌ని చెప్పాడు. కానీ  2024లో అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి త‌న‌ రాజకీయ అవ‌స‌రాల కోసం శ్రీ వేంక‌టేశ్వ‌రుడు కుల దైవం అని కొత్త‌గా ప్ర‌చారం మొద‌లుపెట్టాడు. బీజేపీని ప్ర‌స‌న్నం చేసుకోవడం కోసం అదేప‌నిగా దేవుడి జ‌పం చేస్తున్నాడే కానీ ఆయ‌న‌కు దేవుడంటే భ‌యం కానీ, భ‌క్తి కానీ లేదు. నిజంగా దేవుడంటే భ‌య‌భ‌క్తులు ఉన్నవాడు ఇంత నీచంగా తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని, బాత్రూమ్‌లు క‌డిగే ర‌సాయ‌నాలు క‌లిపార‌ని చెబుతారా?  ఏ మ‌తంలోనైనా ఇంత నీచంగా దిగ‌జారి దేవుడి మీద‌నే నింద‌లు వేసిన వారున్నారా? ఇత‌ర మ‌తాల్లో అయితే చంద్ర‌బాబులా త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేసిన వారిని మ‌త బ‌హిష్క‌ర‌ణ చేసేవారు. 

● ముస్లింల‌కు ఏం స‌మాధానం చెబుతావు? 

ఆయ‌న రాజ‌కీయ జీవితం మొత్తం చూస్తే అడ్డ‌దారిలో అధికారంలోకి వ‌చ్చాడే కానీ, ప్ర‌జ‌ల‌కు సేవ చేసి వారి మ‌న్న‌న‌లు పొంది గెల‌వ‌లేదు. 2024లో  ఈవీఎంలు మేనేజ్ చేసి చంద్ర‌బాబు ఎలా అధికారంలోకి వ‌చ్చాడో ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ గారు ఆధారాల‌తో స‌హా రుజువులు చూపిస్తుంటే, దానిపై టీడీపీ నాయ‌కులు ఎవ‌రూ స్పందించ‌కుండా రెండేళ్లుగా తేలు కుట్టిన దొంగ‌ల్లా ఉండిపోయారు. 1994లో ఎన్టీఆర్ గారు 258 సీట్ల‌తో టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే ఈనాడులో నాపై త‌ప్పుడు వార్త‌లు రాయించి, న‌న్ను బూచిగా చూపించి 8 నెల‌ల్లోనే అధికారం లాగేసుకున్నాడు. పిల్ల‌నిచ్చి మామ అనే గౌర‌వం లేకుండా ఎన్టీఆర్ వ్య‌క్తిత్వం గురించి ఎన్ని ర‌కాలు విష‌ప్ర‌చారం చేశాడో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. యూనివ‌ర్సిటీ స్థాయి నుంచే రెడ్డి, క‌మ్మ అంటూ కుల విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డం చంద్ర‌బాబుకి అల‌వాటు. అవ‌స‌రానికి బీజేపీ పంచన చేర‌డం, హిందూ మ‌తోద్ధార‌కుడిలా ప్ర‌చారం చేసుకోవ‌డం.. బీజేపీ నుంచి బ‌య‌ట‌కొచ్చిన‌ప్పుడు ఇత‌ర మ‌తాల ప‌క్షాన మాట్లాడ‌టం ఆయ‌న నైజం. బీజేపీ నుంచి బ‌య‌ట‌కొచ్చాక ముస్లింల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఎప్ప‌టికీ బీజేపీ పంచ‌న చేర‌న‌న్నాడు. ఇప్పుడు ముస్లింల‌కు ఏం స‌మాధానం చెబుతాడు? కుల‌మ‌తాల‌ను రాజ‌కీయ అవ‌స‌రాల‌కే త‌ప్ప‌, చంద్ర‌బాబుకి దేవుడంటే భ‌క్తి విశ్వాసం ఏమాత్రం లేదు. ఆ భ‌య‌మే ఉంటే ఇన్ని దుర్మార్గాలు చేసేవాడు కాదు. అధికారంలోకి రావ‌డం కోసం ఎంత నీచానికైనా దిగజారుడ‌తాడు. అవినీతితో ల‌క్ష‌ల కోట్లు సంపాదించ‌డ‌మే చంద్ర‌బాబు ల‌క్ష్యం. ఆ అవినీతి సొమ్ముతో వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసి త‌న‌పై న‌మోదైన కేసుల‌ను ఎత్తి వేయించుకుంటున్నాడు. అడ్మినిస్ట్రేష‌న్‌కి చంద్ర‌బాబుకి అర్థ‌మే తెలియ‌దు. 

● రాజ‌కీయం కోసం భార్య‌ను కూడా వాడుకున్న వ్య‌క్తి 

రాజ‌కీయం కోసం భార్య‌ను కూడా వాడుకున్న వ్య‌క్తి చంద్ర‌బాబు. ఎన్టీఆర్ కుటుంబం అంటే ఆయ‌న‌కు ఏమాత్రం అభిమానం లేదు. ఆయ‌న నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి కావ‌డం తెలుగు ప్ర‌జ‌ల దౌర్భాగ్యం. ఆయ‌న రాజ‌కీయ జీవితంలో ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్క‌టీ లేదు. ఇత‌రులు చేసిన ప‌నిని త‌న‌దిగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ చేయ‌డ‌మే ఆయ‌న నైజం. పాపాల‌న్నీ తనే చేసి నిర్దాక్షిణ్యంగా ఎదుటి వారి మీద‌కు నెట్టేస్తాడు. హెరిటేజ్ సంస్థలో పెట్టుబ‌డులు పెట్టించి చంద్ర‌బాబు త‌న‌ను ముంచేశాడ‌ని మోహ‌న్ బాబే చెప్పాడు. వైయ‌స్ జ‌గ‌న్ గారిని ఎదుర్కోలేక ల‌డ్డూ పేరుతో హిందూ వ్య‌తిరేకిగా చిత్రీక‌రించే కుట్ర చేశాడు. చివ‌రికి హెరిటేజ్ పేరుతో చేసిన అవినీతి బ‌య‌ట‌కు రావడంతో అసెంబ్లీ సాక్షిగా మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు పూనుకున్నాడు. తాను చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాల‌ని తెలిసి కూడా వైవీ సుబ్బారెడ్డి భార్య క్రిస్టియ‌న్ అని ప్ర‌చారం చేశాడు. భూమ‌న గారు త‌న కుమార్తెకి క్రిస్టియ‌న్ సాంప్ర‌దాయంలో వివాహం చేశాడ‌ని మాట్లాడాడు. చంద్ర‌బాబు రాజ‌కీయ ఉన్మాదిలా మారిపోయాడు. ఆయ‌న చేస్తున్న ప‌నులు చూసి ప్ర‌జ‌లు చీకొడుతున్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి చంపిన హంత‌కుడు చంద్ర‌బాబు. విద్యా వ్య‌వ‌స్థ‌ను స‌ర్వ‌నాశ‌నం చేసిన లోకేష్‌ను బ‌ల‌వంతంగా రాష్ట్ర ప్ర‌జ‌ల మీద రుద్దే కుట్ర చేస్తున్నాడు. ముఖ్య‌మంత్రిగా చేయ‌కూడ‌ని త‌ప్పుడు చేశాడు. పాపాల‌న్నింటికీ కేంద్ర బిందువు చంద్ర‌బాబు. ఇన్ని త‌ప్పులు చేసిన చంద్రబాబుని దేవుడే తొంద‌ర్లోనే శిక్షిస్తాడు. హిందూ మ‌తాన్ని అప్ర‌దిష్ట‌పాలు చేస్తున్న చంద్ర‌బాబుకి బీజేపీ నాయ‌కులైనా బుద్ధి చెప్పాలి.

Back to Top