పింఛన్ కోతలతో వృద్ధుల అవస్థలు

కూటమి ప్రభుత్వంపై ల‌బ్ధిదారుల ఆగ్ర‌హం

కృష్ణాజిల్లా:  పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలంలో పింఛన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం పింఛన్ మొత్తంలో కోతలు విధిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులకు నెలకు రూ.4000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇంటి పన్ను, నీటి పన్ను పేరుతో రూ.2000 వరకు కోత విధిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వికలాంగుల పింఛన్లను కూడా తొలగించడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని స్థానికులు చెబుతున్నారు. పెదపారుపూడి గ్రామంలో అనేక మంది వృద్ధులు పింఛన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు కోతలు విధిస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పింఛన్ కోతలను నిలిపివేసి, వృద్ధులకు పూర్తిగా హామీ ఇచ్చిన మొత్తాన్ని అందించాలని స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. 

Back to Top