తాడేపల్లి: భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనూష బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ఆదేశాల మేరకు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినందుకు శ్రీ వైయస్ జగన్‌కు బొత్స అనూష కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. భీమిలి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం భీమిలి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతం, నాయకులు-కార్యకర్తల సమన్వయంపై శ్రీ వైయస్ జగన్ బొత్స అనూషకు పలు సూచనలు చేశారు.