టెక్కలి రైలు ప్రమాద ఘటనపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

 నలుగురు విద్యార్థుల మృతి అత్యంత విషాదకరం

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

శ్రీకాకుళం జిల్లా: టెక్కలి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెక్కలి మండలం రావివలస సమీపంలో రైలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, మరో విద్యార్థి గాయపడ్డాడు.

ఈ ప్రమాదంలో విద్యార్థులు విశాఖరావు, దిలీప్‌కుమార్‌, శివ, శరత్‌కుమార్‌ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని శ్రీ వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

చేతికందివచ్చిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతమని, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ప్రమాదంలో గాయపడిన విద్యార్థి సాల్మన్‌రాజ్‌కు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అతను త్వరగా కోలుకోవాలని శ్రీ వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు.

Back to Top