మాజీ మంత్రి జోగి రమేష్‌ను కలిసిన అంబటి మురళీకృష్ణ

ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్‌ను పొన్నూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి అంబటి మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. సంబంధం లేని కేసుల్లో కక్షసాధింపు ధోరణితో అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్యగా ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికార దాహంతో నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. అక్రమంగా అరెస్ట్ చేసి రాజకీయ ప్రత్యర్థులను అణిచివేశామని అనుకుంటూ కూటమి నేతలు కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే ప్రజాస్వామ్యంలో ఇటువంటి దమనకాండలు ఎక్కువ కాలం నిలవవని స్పష్టం చేశారు. జోగి రమేష్‌పై జరిగిన అక్రమ అరెస్ట్ బలహీన వర్గాలపై చేసిన దాడితో సమానమని అంబటి మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడే నాయకులను భయపెట్టే ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావని అన్నారు. జోగి రమేష్‌కు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఆయనపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పార్టీ చట్టపరంగా, రాజకీయంగా పోరాటం కొనసాగిస్తుందని అంబటి మురళీకృష్ణ భరోసా ఇచ్చారు. ప్రజల మద్దతుతో ఈ అక్రమ చర్యలకు తగిన గుణపాఠం చెప్పే రోజు తప్పక వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Back to Top