ఛార్జ్‌షీట్‌కు, చాట్‌ జీపీటీకి తేడా తెలుసుకో

విషయం తెలుసుకుని మాట్లాడు ‘కొండగొర్రె’

కిరణ్‌రాయల్‌కు నాగార్జునయాదవ్‌ చురక

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి వై.నాగార్జునయాదవ్‌.

తిరుమల నెయ్యిపై ప్రతిష్టాత్మక సంస్థల నివేదిక

ఆ అంశాలనే సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చింది

అది నీకు అవగాహన లేదు. అందుకే పిచ్చి మాటలు

చాట్‌ జీపీటిని ప్రస్తావిస్తూ నిందలు, ఆరోపణలు

మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేని చరిత్ర నీది

అలాంటి నీవు ఒక మాజీ మంత్రిపై విమర్శలు చేస్తావా?

నీ స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడు

లేకపోతే తిరుపతిలోనే నీకు తగిన బుద్ధి చెబుతారు

కిరణ్‌రాయల్‌ తీరుపై నాగార్జున యాదవ్‌ ఫైర్‌

తాడేపల్లి: ఛార్జ్‌షీట్‌కు, చాట్‌ జీపీటికి తేడా తెలియని ఒక ‘కొండగొర్రె’.. జనసేన నాయకుడు కిరణ్‌ రాయల్‌ నోటికి ఏదొస్తే అది ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వై.నాగేంద్రయాదవ్‌ స్పష్టం చేశారు. సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్‌కె రోజాపై కిరణ్‌ రాయల్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు దిగజారిన రాజకీయ సంస్కృతికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. తిరుమల నెయ్యిపై దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ నివేదికల ఆధారంగానే తిరుమలలో వాడిన నెయ్యిపై సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిందన్న ఆయన, వాటిపై కనీస అవగాహన లేకుండా తిరుపతి జనసేన నాయకుడు.. చార్జ్‌ జీపీటీ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని చురకలంటించారు. కిరణ్‌రాయల్‌ తన వైఖరి మార్చుకోకపోతే, తిరుపతిలోనే తగిన బుద్ధి చెబుతారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వై.నాగార్జునయాదవ్‌ తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో నాగార్జునయాదవ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

కూటమి విషప్రచారాలు బట్టబయలు:
    వైయ‌స్ఆర్‌సీపీని, జగన్‌గారిని అదేపనిగా నిందిస్తూ తిరుమలలో వాడిన నెయ్యిపై ఇన్నాళ్లూ కూటమి నేతలు చేసిన విషప్రచారం పచ్చి అబద్ధమని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (ఎన్‌డీఆర్‌ఐ), ‘నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు’ (ఎన్‌డీడీబీ) నివేదికలతో స్పష్టంగా రుజువైంది. అయినా చేసిన తప్పు ఒప్పుకోకుండా, అదే తప్పుడు ప్రచారంతో ఎదురుదాడి చేయడం అత్యంత హేయం. ఆ దిశలోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, కల్తీ నెయ్యి కెమికల్‌ నెయ్యి అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా దిక్కుతోచక ఆ ఛార్జ్‌షీట్‌లోని అంశాలపై మా పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని అర్థం లేని విమర్శలు చేస్తున్నారు.

ఛార్జ్‌షీట్‌కు, చాట్‌ జీపీటీ తేడా తెలుసుకో:
    ఛార్జ్‌షీట్‌కు, చాట్‌ జీపీటీకి తేడా ఏమిటో కిరణ్‌రాయల్‌ తెలుసుకోవాలి. ఒకవేళ చాట్‌ జీపీటీనే ప్రామాణికం అయితే, పోలీసులు, కేసులు, దర్యాప్తులు, ఛార్జ్‌షీట్లు, కోర్టులు, విచారణలు ఎందుకు? కనీసం ఆ పరిజ్ఞానం కూడా లేకుండా, చార్జ్‌ జీపీటిని ప్రస్తావిస్తూ, తిరుపతి జనసేన నాయకుడు కిరణ్‌రాయల్‌ పిచ్చిగా వాగాడు. మేము గొర్రెలం కాదు. తనే ఒక పెద్ద కొండగొర్రె. తన స్థాయి ఏమిటో ఇప్పటికైనా తెలుసుకోవాలి. చార్జ్‌ జీపీటిని ప్రస్తావించి, మమ్మల్ని తప్పు పట్టడం కాదు. ఇకనైనా కనీస పరిజ్ఞానం పెంచుకో.

ఆ అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు:
    సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్‌కె రోజాపై తిరుపతి జనసేన నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వాటిని సహించేది లేదు. మహిళలను వంచించి మోసం చేసే నైజం కిరణ్‌రాయల్‌ది. అలాంటి వ్యక్తి రోజా వంటి సీనియర్‌ నాయకురాలిపై నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. చివరకు అతణ్ని ఆ కామసేన పార్టీనే వెలివేసిందంటే అతని స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలి. మహిళల పట్ల కనీస గౌరవం లేని కిరణ్‌రాయల్‌ ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలి. పిచ్చి వాగుడు, విమర్శలు కట్టిపెట్టాలి. లేకపోతే తిరుపతిలోనే అతడికి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని నాగార్జునయాదవ్‌ హెచ్చరించారు.

Back to Top