గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా జనం అంతా ఒక్కటయ్యారు. బుధవారం గుంటూరులో పోలీసుల ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రోడ్లపైకి భారీ సంఖ్యలో చేరి వైయస్ జగన్ వెంట కదులుతూ చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్నారు. వైయస్ జగన్ మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా స్పష్టంగా కనిపించింది. టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించాలని చూస్తే.. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీస్ వ్యవస్థను రంగంలోకి దించి ఆ పర్యటనను విఫలం చేసే ప్రయత్నాలకు దిగింది. పోలీసుల ఆంక్షలు అర్ధరాత్రి వైయస్ఆర్‌సీపీ నేతలకు నోటీసులిచ్చి మరీ బెదిరింపులకు దిగింది. గుంటూరుకు వెళ్లే రోడ్లన్నింటినీ పోలీసు చెక్‌పోస్టులతో నింపేయించింది. వైయస్ఆర్‌సీపీ నేతలు, శ్రేణులు.. ఆఖరికి అభిమానులను సైతం అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించింది. కానీ.. ఈ పరిణామాలన్నింటిని ప్రజలు నిశితంగా పరిశీలించారు. ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్న టీడీపీ అరాచకాలను చూసి అసహ్యింంచుకుంటున్న జనం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. పోలీసుల వలయాన్ని ఛేధించుకుని.. ఏపీలో జంగిల్‌రాజ్‌కు వ్యతిరేకంగా జనం ఒక్కటయ్యారు. వైయస్ జగన్ పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తే.. పోలీసుల ఆంక్షల వలయాల్ని చేధించుకుని స్వచ్ఛందంగా.. భారీగా, వేల సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. పోలీసులు ఎప్పటిలాగే జగన్ పర్యటనలో భద్రత కల్పించకుండా దూరంగా ఉంటే.. ఆ జననేతకు జనమే సాదర స్వాగతం పలికారు. రోడ్లన్నీ జనసంద్రం.. గుంటూరు పర్యటనలో అరుదైన దృశ్యాలు కనిపించాయి. జనం స్వచ్ఛందంగా ముందుండి వైయస్ జగన్ కాన్వాయ్‌ను ముందుకు నడిపించారు. జగన్ రాక నేపథ్యంలో గుంటూరు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. ఈ పరిణామాలను చూస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఇది కూటమి ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహమేనని, జగన్ వెంటనే తాము ఉన్నామంటూ ఇచ్చిన సంకేతాలని అంటున్నారు.