వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం

గుంటూరు:  వైయ‌స్ జగన్ గుంటూరు ప‌ర్య‌ట‌న‌లో పోలీసులు ఆంక్ష‌లు విధించారు. వైయ‌స్ జ‌గ‌న్ వెంట వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు వెళ్ల‌కుండా ముంద‌స్తుగా నాయ‌కుల‌కు నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో బారికేడ్స్, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌ను వెళ్ల‌కుండా క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నం చేశారు. అభిమానులను, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్నటికీ అవన్నీ విఫలమయ్యాయి. జననేత జగన్‌ కోసం భారీగా తరలివచ్చిన జనం ముందుండి వైయ‌స్ ‌జగన్‌ను నడిపించారు.  ప్రజలను అడ్డుకోడానికే చేసిన కుట్రలను అభిమానులు చేధించారు. జంగిల్‌ రాజ్‌ కుట్రలకు ఎదురు తిరిగి ముందుకు సాగారు. గుంటూరులో పరిణామాలపై అటు ప్రజలు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.

Back to Top