మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి  వైయస్ జగన్ ఫైర్‌

స్మార్ట్ కిచెన్స్ పేరుతో 85 వేల మంది అక్కచెల్లెమ్మల ఉపాధిపై కత్తి

బకాయి జీతాలను వెంటనే విడుదల చేయాలి.. వేతనాలు పెంచాలి

తాడేప‌ల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల మంది అక్కచెల్లెమ్మల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా..
గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో  చంద్ర‌బాబు  చెలగాటం ఆడుతున్నారు. దాదాపు 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు, వీరిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు, స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిపెట్టారు. గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వేయి ఉండే జీతాన్ని రూ.3వేల వరకూ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు, ఇప్పుడు స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో వీరిని తొల‌గించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. మధ్యాహ్నభోజన కార్మికుల తరఫున పోరాడుతాం, వారికి అండగా నిలుస్తాం. ఇప్పటికే బకాయిపెట్టిన జీతాలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఎన్నికల హామీ మేరకు వారి వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైయస్ జగన్ గట్టిగా డిమాండ్ చేశారు.
 

Back to Top