తాడేపల్లి: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) మాజీ అధ్యక్షుడు, కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ జి.ఎస్.రావు మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు నిడుదవోలు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న శ్రీ జి.ఎస్.రావు కన్నుమూయడం బాధాకరమని శ్రీ వైయస్ జగన్ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో జి.ఎస్.రావు చేసిన సేవలు, రాజకీయ రంగంలో ఆయనకున్న విశిష్ట అనుభవం చిరస్మరణీయమని అని ఆయన అన్నారు. జి.ఎస్.రావు గారి మరణం రాజకీయ రంగానికి తీరని లోటని గుర్తు చేశారు. జి.ఎస్.రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు శ్రీ వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.