సీబీఐ ఛార్జి షీట్ తో బయటపడ్డ వాస్తవాలు

తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఆరోపణలు పచ్చి అబద్దం

ప్రతిష్టాత్మకమైన లేబొరేటరీల సాక్షిగా తేలిన నిజం

రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఆరోపణలు

కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన బాబు

చంద్రబాబు తీరుపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.

తప్పు జరిగినా క్షమాపణ చెప్పని చంద్రబాబు

సిట్ నివేదికతో తనను తాను సమర్థించుకోలేక అవస్థలు

మరింత దిగజారి లడ్డూపై మరలా దుష్ప్రచారం

ప్రజా క్షేత్రంలో బాబును బోనులో నిలబెట్టాల్సిందే

తేల్చి చెప్పిన సజ్జల రామకృష్ణా రెడ్డి

బోలేబాబా డెయిరీని ప్రోత్సహించిందే చంద్రబాబు

మా హయాంలో బ్లాక్ లిస్ట్ లో బోలేబాబా డెయిరీ

ఇతర డెయిరీల ద్వారా సరఫరా చేశాడంటున్న సిట్ 

ఇందులో రాజకీయ జోక్యం లేదంటూ నివేదిక 

ఛార్జి షీట్ వాస్తవాలను ప్రస్తావించిన సజ్జల రామకృష్ణారెడ్డి

బాబు వ్యాఖ్యలను తప్పుపట్టిన సుప్రీం కోర్టు

వ్యక్తిత్వ హననంలో భాగంగానే తప్పుడు ఆరోపణలు

బాబు మినహా మరెవ్వరూ ఇలాంటి నీచ ఆరోపణలు చేయలేరు

మండిపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి

తన ఆరోపణలు అవాస్తవమని తేలితే ఆనందపడాలి

కానీ హోర్డింగులు, ఫ్లెక్సీల ద్వారా మరింత దుష్ప్రచారం

ఇలాంటి ప్రవర్తన వల్ల రాక్షస తెగ అనడంలో తప్పులేదు

తేల్చి చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి

తన వ్యాఖ్యలపై బాబు మౌనం ఎందుకు ?

ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉన్నాడా?

లేనిపక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలి

ఇదే విషయాన్ని మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదు?

సూటిగా నిలదీసిన సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు  పచ్చి అబద్దాలని, సీబీఐ ఛార్జిషీట్ ద్వారా ఈ విషయం వెల్లడైందని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన లేబొరేటరీల సాక్షిగా ఈ విషయం తేట తెల్లమైందన్న ఆయన... కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... తన వ్యాఖ్యల ద్వారా కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన బాబు.. అది తప్పని తెలిసినా క్షమాపణ చెప్పకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పైగా సిట్ నివేదికతో తనను తాను సమర్థించుకోలేని సీఎం.. మరింత దిగజారి లడ్డూపై మరలా దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఈ నేపధ్యంలో బాబును ప్రజా క్షేత్రంలో బోనులో నిలబెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. గతంలో చంద్రబాబు బోలే బాబా డెయిరీని ప్రోత్సహిస్తే... వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో బ్లాక్ లిస్ట్ లో పెట్టిన విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను సుప్రీం కోర్టు సైతం తప్పుపట్టిందని... తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే ఆనందపడాల్సింది పోయి.. మరలా విష ప్రచారానికి తెర లేపడాన్ని ఖండించారు. ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్లను రాక్షస తెగ అనడంలో తప్పులేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నోరెత్తకపోయినా.. మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.తన వ్యాఖ్యలకు కట్టుబడిలేకపోతే... చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే...

● చంద్రబాబు వ్యాఖ్యలు వెనుక రాజకీయ దురుద్దేశం..

2024 సెప్టెంబరులో తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న  సీఎం చంద్రబాబు  వ్యాఖ్యలతోనే వివాదం మొదలైంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో మనం గమనించాల్సిన ప్రధాన అంశం... జాతీయ స్ధాయిలో ప్రతిష్టాత్మకమైన లేబోరేటరీ రెండూ తమ రిపోర్టులో  చంద్రబాబు చేసిన నీచమైన, అన్యాయమైన, పాపిష్టి ఆరోపణలు అబద్దం అని తేల్చాయి.  లడ్డూలో జంతు కొవ్వు కల్తీ జరగలేదన్న విషయం పక్కాగా నిరూపితమైంది. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారన్నది బట్టబయలైంది. 
అయితే తన దుర్మార్గమైన వ్యాఖ్యలతో కోట్లాది మంది స్వామి వారి భక్తులను షాక్ కి గురి చేసింది మాత్రం చంద్రబాబే. దాన్ని అంతే గట్టిగా తిప్పికొట్టకపోతే... ఆయన తనంతట తాను నేను తప్పు చేశాను, ఆ మాట వాడకుండా ఉండాల్సింది అని అనకపోతే అది అలాగే నిల్చిపోయే అవకాశం ఉంది కాబట్టి... అందరూ ముక్తకంఠంతో చంద్రబాబూ నువ్వు తప్పు చేశావని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబుకు మాత్రం తప్పు జరిగింది.. క్షమాపణ చెప్పాలన్న విచక్షణ లేదు. పైగా మరింత దిగజారి ఆయనతో పాటు సైతాను లక్షణాలతో ఒక కూటమిగా చేరిన వారందరూ ఇంకా కల్తీ జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారు. దాన్ని కూడా కచ్చితంగా ఎండగట్టాలి. అదే విధంగా చంద్రబాబు ముందు చెప్పిన అబద్దపు ఆరోపణలనూ ఎండగట్టాలి. ప్రజాక్షేత్రంలో చంద్రబాబును బోనులో నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది. 

● అడ్డంగా దొరికి మరింత అడ్డగోలు ప్రచారం..

అసలు నెయ్యే సరఫరా చేయలేదు, కెమికల్స్ కలిసిన నెయ్యిని వాడారని ఆరోపిస్తున్నారు. ఇవే బ్యానర్లను వేసి రాష్ట్ర మంతా ప్రచారం చేస్తున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ... దారుణమైన రాజకీయ ఆరోపణలు చేసిన చంద్రబాబు దాన్ని సమర్ధించుకోవడానికి తగిన ఆధారాలు లేని పరిస్థితుల్లో.. అడ్డగోలుగా ఇంకా మరింత దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారు. అసలు సుప్రీంకోర్టు ఆదేశాలు, సీబీఐ దర్యాప్తు ప్రధానంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆంశంపైనే సాగింది. ఇక చంద్రబాబు చెబుతున్నట్టు నెయ్యి సరఫరా దారులను చూస్తే... ప్రస్తుతం బోలే బాబా అని చెబుతున్న సరఫరాదారులు గతంలో చంద్రబాబు హయాంలో హర్ష డెయిరీ పేరుతో ఉన్నదాన్నే పేరు మార్చారు. బాబు హయాంలో 2018 ప్రాంతంలో ఆ డెయిరీ తనిఖీకి వెళ్లి, అర్హత పత్రం ఇచ్చి, సఫ్లై ఆర్డరు కూడా ఇచ్చారు. ఆ రోజు ఉన్న డెయిరీ మా హయాంలో వచ్చేసరికి రిజెక్ట్ అయింది. ఇప్పుడేమే వాళ్లే వేరే కంపెనీల ద్వారా వచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. మరలా అది కూడా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న సాంపుల్స్ ను బట్టే చెబుతున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో బోలేబాబా  డెయిరీయే హర్ష డెయిరీగా పేరు మార్చుకుని వచ్చింది. మరలా 2019లో మేం దాన్ని రిజక్ట్ చేస్తే... 2024 చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత సరఫరా చేసిన నెయ్యిని టెస్ట్ చేసారు. అది కూడా  ఏ ఆర్ డెయిరీ నుంచి వచ్చిన నెయ్యి శాంపిల్స్ పరీక్షించారు. 
 అయితే ఈ ఏ ఆర్ డెయిరీతో పాటు మరో రెండు సంస్థలకు బోలేబాబా సరఫరా చేశాడు. అది కూడా 2019-24 మధ్యనే ఇదంతా జరిగిందని చెబుతున్నారు. మా విచారణలో అక్కడకి వెళ్లి ఖాలీ డ్రమ్ములు, ఇన్ వాయిస్ లు చూసి పట్టుకున్నామని ఛార్డిషీట్ లో ఉంది. వాళ్లెవరు అన్నది విచారణలో తేలుతుంది. కానీ రికార్డుల్లో బోలేబాబా అని లేదు, ఏ ఆర్ డెయిరీ అని మాత్రమే ఉంది. సిట్ ఛార్జ్ షీట్ లో బోలేబాబా అన్నది లేదు.. ఈ డెయిరీలో ద్వారా సరఫరా చేశారని చెబుతున్నారు. అది విచారణలో తేలుతుంది.
అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వం కానీ, టీటీడీ బోర్డు, సభ్యులు ఉన్నారని మాత్రం ఆరోపణ కానీ, ప్రస్తావన కానీ ఎక్కడా ప్రస్తావించలేదు.

● బోలేబాబాను ప్రోత్సహించిందే బాబు..

అంటే బోలేబాబాను గతంలో ఎంకరేజ్ చేసిందీ చంద్రబాబూ, తాజాగా చంద్రబాబు జూన్ 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసిన శాంపుల్స్ నుంచే విచారణకు పంపించారు. ఈ శాంపిల్స్ కూడా బోలేబాబకు సంబంధించినది కాదు... ఏ ఆర్ డెయిరీ కి బోలేబాబా సరఫరా చేసిందన్నది మా విచారణలో తేలిందని సిట్ తెలిపింది. అది విచారణలో తేలుతుంది.  అలాంటప్పుడు వైవీ సుబ్బారెడ్డి గారి హయాంలో, వైయస్.జగన్ హాయంలో ఏ రకంగానూ తప్పు జరగలేదు.
మరో అంశం అప్పన్న లావాదేవీలపై మాట్లాడుతున్నారు. అతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  పీఏగా ఉన్నారన్న విషయం కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య అప్పటి టీటీడీ పర్చేజింగ్ కమిటీలో సభ్యురాలుగా ఉన్నారన్న విషయం దర్యాప్తులో కానీ, మీడియాలో కానీ ఎందుకు ప్రస్తావనకు రావడం లేదు?. 
నిష్పాక్షపాతంగా విచారణ జరుగుతుంటే ఇవన్నీ ప్రస్తావనకు ఎందుకు రావడం లేదు? కేవలం సుబ్బారెడ్డి పీఏ అని చెప్పడం ద్వారా మరో నీచమైన రాజకీయాని తెరతీయాలనుకుంటున్నారు. 

సుప్రీం కోర్టు సైతం చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టింది.  బాధ్యతాయుతమైన స్ధానంలో ఉండి అలాంటి
వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. బోర్డు తరపున నుంచి ఎలాంటి విచారణ లేకుండా ఈ రకంగా బాధ్యతలేకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే.. చంద్రబాబు ఆయన అనుచర వర్గం ఓ రాక్షస తెగ మాదిరిగా వ్యవహరిస్తూ.. సైకోల మాదిరిగా ఎదుటివాడు కోలుకోకుండా దారుణంగా దెబ్బకొట్టడంతో పాటు వారి చేతిలో ఉన్న ప్రసార సాధనాల ద్వారా దుష్ర్పచారం చేయడమే వీరి లక్ష్యం. ప్రాణాలు తీయకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే వీరి లక్ష్యం. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేయడమే షాక్. ఒక మనిషి ఇంత అన్యాయమైన, నీచమైన ఆరోపణ చేయగలడా? అది కూడా ముఖ్యమంత్రి స్దానంలో ఉన్న వ్యక్తి ఇంతటికి దిగజారాడా అన్న షాక్ సిబీఐ నివేదిక చూసిన తర్వాత అయినా వచ్చి ఉంటుంది.

● వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పటిష్ట చర్యలు...

సిట్ నివేదికలో పామొలిన్ ఇతర రకాలు కలిసిందని చెబుతున్న నేపధ్యంలో.. దాంతో తయారు చేసిన లడ్డూ రెండు రోజుల పాటు ఉంటుందా? ఛార్జిషీట్ లో ఫైల్ చేసిన దానికి కూడా ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. కోర్టులు వాటి ఆధారంగా  నిర్ణయాలు తీసుకుంటారు. టీటీడీ లాంటి పెద్ద వ్యవస్ధలు స్వతంత్రంగా పనిచేస్తుంటాయి. అయినప్పటికీ కూడా వైయస్.జగన్ హయాంలో టీటీడీలోని వ్యవస్ధలను మరింత సమర్ధవంతంగా పనిచేయించడానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకున్నారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం గతంలో కంటే మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నారు. పరకామణి కోసం కూడా నూతన భవనాన్ని నిర్మించి, మరింత మెరుగైన టెక్నాలజీని కూడా వైయస్.జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 

టీటీడీ బోర్డు ద్వారా నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. గతంలోనూ నెయ్యి సరఫరా ఈ కంపెనీలు చేశాయి. ఈ నేపధ్యంలో 2019-24 లో మాత్రమే అని ఎలా చెబుతారు?. ఒక్కటి అయితే వాస్తవం.. టీటీడీ నిర్వహణలో సాధారణంగా జరిగే తనిఖీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అవి గతంలోనూ జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. కేవలం చంద్రబాబు అన్న ఒక్క మాట మొత్తం జాతి దృష్టిని ఆకర్షించింది. అది అబద్దం అనేది మా వాదన. మిగిలినవన్నీ కోర్టులో తేలుతాయి. ఆధారాలు లేకుండా 
ఎలా మాట్లాడతారు? ఒకవేళ ఉంటే ఆయన హయాంలోనే బోలేబాబా వచ్చింది. అప్పుడు మంచిదైన బోలేబాబా.. ఇప్పుడెలా కల్తీ అయింది, అది కూడా ఆయన హయాంలోనే తేలింది.

● మరో కుట్రకు తెరలేపే ప్రయత్నం..

వాస్తవానికి ఎల్లో మీడియాలో చెబుతున్నట్టు మా హాయంలో బోలేబాబా అనే సంస్ద లేదు. ఒక్కసారి 2019 సెప్టెంబరులో వస్తే... అది డిస్ క్వాలిఫై చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. అదే చంద్రబాబు హయాంలో సాంకేతికంగా తనిఖీ చేసి మరీ హర్ష డెయిరీ పేరుతో బోలే బాబా ను నెయ్యి సరఫరాకు ఎంపిక చేసారు. ఇప్పుడు ఈ బోలే బాబా పరోక్షంగా ఇతర సంస్థల ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని చెబుతున్నారు. అది కోర్టులో తేలుతుంది.  ఒకవేళ టీటీడీ వ్యవహారాల్లో ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందను కుంటే.. ఇప్పుడున్నది చంద్రబాబు ప్రభుత్వం ఆయనకే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మా అనుమానం ఏమిటంటే.. ఇందులో కూడా మరో మహా కుట్రకు కూడా తెరలేపినా  ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 
సిబీఐ కోర్టుకు సమర్పించిన అఫిడివిట్ లో  లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని తేలితే.. ఆనందంగా ఫీలవ్వాలి. కల్తీ జరిగిందని చెప్పినందుకు.. అది నిజం కాదని తెలిసినప్పుడు నాలుక్కరుచుకోవాలి, లేదంటే దాటవేసే ప్రయత్నం చేస్తారు. కానీ కల్తీ నిజమని హెర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టడం చూస్తుంటే మరింత ఆశ్చర్యం కలుగుతోంది. ప్రసాదం కల్తీ అయిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు  అనేకమంది మా మనోభావాలు దెబ్బతిన్నాయని భావించగా... లడ్డూలో జంతుకొవ్వులు కలవలేదని తెలిసి అందరూ ఆనందపడే సమయంలో మరలా అదేప్రచారం చేస్తున్న వీళ్లను రాక్షస తెగ లాగా..  అనడంలో ఏం తప్పు ఉంది?

● బాబు పాపం మరింత బయటపడ్డం ఖాయం..

ఆరోజైనా, ఈరోజైనా చంద్రబాబుకి నిజంతో పనిలేదు. వైయస్.జగన్ ఎప్పుడూ నిజాలనే నమ్ముతారు. కానీ చంద్రబాబు తానే కొన్ని అబద్దాలను క్రియేట్ చేసి.. వాటినే ప్రచారం చేస్తాడు. అందుకోసం తన ఎల్లో మీడియాను వాడుకుంటాడు. అందుకే నివేదికలో వాస్తవాలు ప్రజలకు తెలిస్తే తనకు రాజకీయంగా పెద్ద దెబ్బ తగులుతుందని భావించి.. ముందే ప్రజల మనస్సులో వాస్తవాలు నాటుకుంటాయి. జంతు కొవ్వు కలవలేదన్న నిజం ప్రజల గ్రహించేలోపే... వారి మైండ్ లో కల్తీ జరిగిందన్న ప్రచారం బలంగా చేయడం ప్రారంభించారు. తద్వారా అసలు నిజం మరుగునపడిపోతుంది. మరలా వైయ‌స్ఆర్‌సీపీని టార్గెట్ చేయవచ్చు.. మేం చేసిన పాపం పోతుందని భావించారు. కానీ వాస్తవాలు ప్రజలు గ్రహించారు. చంద్రబాబు చేసిన ఆరోపణ తప్పైందని ప్రజలు గ్రహించారు. ప్రజలు ఈ మాట చెబుతున్నారు అంటే.. జాతీయ స్ధాయిలో కీలకవ్యక్తిగా చెప్పుకునే వ్యక్తి ఇలాంటి ఆరోపణ చేయడం దారుణం అన్న మాట జాతీయస్ధాయిలో కూడా వ్యక్తమవుతోంది.  తాము చేసిన పాపాన్ని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు ఆయన భాగస్వామ్యులు మందుకు వెళ్లే కొద్ది వారు చేసిన పాపం మరింత బహిర్గతమవుతుంది. వాళ్లు ఎంత నికృష్టులో అన్న విషయం కూడా బయటపడుతుంది. 

ఇలాంటి ఆరోపణ చేశారు కాబట్టే.... వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్ళారు. సుప్రీం కోర్టు కూడా తీవ్రంగా స్పందించి దర్యాప్తునకు ఆదేశించారు.  వైవీ సుబ్బారెడ్డి అత్యంత నిష్టాగరిష్ట భక్తుడు.. ఆయన 30 దఫాలుకు పైగా శబరిమల వెళ్లారు. గోవులను అమితంగా ప్రేమించి, పూజిస్తారు. అలాంటి వాళ్లపై కూడా క్రిస్టియన్ అంటూ దుష్ర్పచారం చేశారు. ఒక అబద్దాన్ని నిజం చేయడానికి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏకంగా పందికొవ్వు, ఆవుకొవ్వు, చేపనూనె కలిసాయని ఆరోపించాడు. ఈ లడ్డూలనే అయోధ్యకు కూడా పంపించారని ఆరోపించారు. ఇప్పుడు తీరా సీబీఐ నివేదికలో అలాంటిదేమీ లేదని తెలిసిన తర్వాత వీరిద్దరూ ఎందుకు నోరు మెదపడం లేదు? 
ఇవాళ తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని కానీ, లేదా నోరు జారి మాట్లాడానని ఎందుకు చంద్రబాబు చెప్పడం లేదు?. ఈ మాట మీడియా చంద్రబాబును ఎందుకు అడగడం లేదు?. ఆయన తనను ప్రశ్నించని వాళ్లనే కూర్చోబెట్టుకుంటాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ని  కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు? 
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరపున మేం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం.. ఆయన బయటకు వచ్చి తన వ్యాఖ్యల మీద అయినా నిలబడాలి, లేదా తన తప్పైందని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. వైయ‌స్ఆర్‌సీపీకో, టీటీడీ మాజీ చైర్మన్ లకో క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు... కనీసం దేవుడి పట్ల అపచారం చేశాననో.. భక్తుల మనోభావాలు దెబ్బతీశాననో చెబితే చాలు. అందుకు చంద్రబాబు, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్  సిద్దంగా ఉన్నారా లేదో వేచి చూడాలని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

మనకు అనుకూలంగా వస్తే ఒకలా లేదంటే మరొకలా మాట్లాడాల్సిన పనిలేదు. నివేదిక అంతా సవ్యంగా ఉందని మేం చెప్పడం లేదు.. మేం చెప్పేది ఒక్కటే దర్యాప్తు సంస్ధలు కూడా టాంపర్ చేయలేని ఫ్రూప్.. రెండు జాతీయ సంస్ధలు ఇచ్చిన రిపోర్ట్స్ లో చాలా స్పష్టంగా నెయ్యిలో జంతుకొవ్వు లేదని స్పష్టమైంది.  ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా చంద్రబాబు చెప్పింది పచ్చి అబద్దమని రుజువైందని ఆయన స్పష్టం చేశారు.

Back to Top