ఇందాపూర్‌ పేరెత్తితే ప్రభుత్వం వణికిపోతోంది

హెరిటేజ్‌ తో ఉన్న సంబంధంపై చర్చకు వెనుకడుగు

హెరిటేజ్‌ బాగోతం బయటకొస్తుందని చంద్రబాబు భయం

స్పష్టం చేసిన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ

వెలగపూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి మాట్లాడిన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.  

టీటీడీ నిధుల దోపిడీ ప్రజలకు తెలుస్తుందనే వారి భయం

అందుకే వాయిదా తీర్మానాన్ని పదే పదే తిరస్కరిస్తున్నారు

ఇందాపూర్‌– హెరిటేజ్‌ సంబంధంపై మండలిలో చర్చ జరపాల్సిందే 

ప్రభుత్వం అంగీకరించేదాకా దాకా పోరాడుతూనే ఉంటాం

కల్తీ నెయ్యి ఆరోపణల వెనుక వాస్తవాలన్నీ ప్రజలకు తెలిసేలా చేస్తాం

చంద్రబాబు అవినీతి బాగోతాన్ని ప్రజల ముందు ఉంచుతాం

మా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ప్రభుత్వం పలాయనం

చెప్పులేసుకుని స్వామి వారి ఫొటోలు పట్టుకున్నామని మరో డైవర్షన్‌ డ్రామా 

కూటమి నాయకుల కుట్రలకు దీటుగా బదులిచ్చిన బొత్స సత్యనారాయణ 

అసెంబ్లీ ప్రాంగణం: అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇందాపూర్‌ ముసుగులో హెరిటేజ్‌ చేసిన దోపిడీ బయటకు వస్తుందనే భయంతో కూటమి నాయకులు ఇందాపూర్, హెరిటేజ్‌ డెయిరీల మధ్య ఉన్న సంబంధంపై చర్చకు భయపడి పారిపోతున్నారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణతోపాటు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిధుల దోపిడీని అడ్డుకుంటుంటే వైయ‌స్ఆర్‌సీపీ హిందూ వ్యతిరేక పార్టీ అని కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా లడ్డూ వివాదానికి తెర లేపిన చంద్రబాబు మండలిలో చర్చకు అంగీకరిస్తే, తాము ఆధారాలతో వివాదానికి ముగింపు పలుకుతామని చెప్పారు. ఆ తర్వాత తప్పు ఎవరు చేశారో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఇందాపూర్‌ ముసుగులో హెరిటేజ్‌ డెయిరీ దోపిడీకి పాల్పడకపోయుంటే చర్చించడానికి ఎందుకు భయపడిపోతున్నారని ప్రశ్నించారు.
    దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న కూటమి నాయకులకు బుద్ధిని ప్రసాదించాలని తిరుమల శ్రీవేంకటేశ్వరుడి చిత్రపటంతో తాము ప్రదర్శన చేస్తే.. చెప్పులేసుకుని దేవుడి ఫొటోలు పట్టుకున్నారంటూ దాన్ని కూడా డైవర్షన్‌ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.  పోడియం వద్ద చెప్పులేసుకుని తాము దేవుడి ఫొటోలు పట్టుకుని ఉంటే చూపించాలని, చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే ఇందాపూర్, హెరిటేజ్‌ డెయిరీ సంబంధాలపై చర్చకు సిద్ధమని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.
    కల్తీ నెయ్యి పేరుతో టీటీడీ నిధుల దోపిడీ జరిగిన మాట వాస్తవం కాబట్టే ఇలాంటి కుంటి సాకులు వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థ అవినీతికి పాల్పడిందనేది నెయ్యి ధరల పెంపుతో స్పష్టమైందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఏమాత్రం ప్రజలకు ప్రయోజనకరంగా లేదని, దీనిపై రాబోయే మూడు రోజుల పాటు ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. దేవదేవుడి మీద నిందలు మోపినందుకు చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులతో పాటు పార్టీ నాయకులు కూడా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఇంకా ఏం మాట్లాడారంటే..:
 
అక్రమార్జన కోసం టీటీడీని వాడుకున్నారు
:బొత్స సత్యనారాయణ. మండలి విపక్ష నేత

– లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్‌ ఛార్జిషీట్‌లో స్పష్టం చేసిన తర్వాతైనా కూటమి నాయకులకు జ్ఞానోదయం కలిగి కల్తీ నెయ్యి పేరుతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన తప్పుడు ప్రచారానికి లెంపలేసుకుని క్షమాపణలు కోరతారని ఆశించాం. కానీ చేసిన తప్పును సమర్థించుకోవడానికి బాత్రూమ్‌ క్లీనింగ్‌కి వాడే విషపూరితమైన రసాయనాలు కలిపారని మరింత దిగజారి ప్రచారం ప్రారంభించారు. వారు చేసిన ఏ ఆరోపణలకూ ఆధారాలే లేవు. కానీ వైయస్సార్సీపీ మీద నెపం నెట్టి వైయస్‌ జగన్‌ గారి మీద హిందూ వ్యతిరేకి ముద్ర వేసి రాజకీయ లబ్ధి పొందాలని బరి తెగించి వ్యవహరించారు. చివరికి వారు చేస్తున్న పాపాలకు విసిగిపోయిన కలియుగదైవమే స్వయంగా రంగంలోకి దిగి ఇందాపూర్‌ డెయిరీతో హెరిటేజ్‌కి ఉన్న సంబంధాన్ని బయటపెట్టి చంద్రబాబు ఆట కట్టించాడు. రూ.300కి దొరికేది కల్తీ నెయ్యే అని వ్యూహాత్మకంగా చేసిన ప్రచారం వెనుక ఉన్న మర్మం హెరిటేజ్‌కి టీటీడీ నిధులు దోచిపెట్టడానికేనని తేలిపోయింది. ఇందాపూర్‌ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టును కేజీ నెయ్యి రూ.658కి కట్టబెట్టిన చంద్రబాబు వికృత రూపం ప్రపంచం మొత్తం చూసింది. తన అక్రమార్జన కోసం టీటీడీని చంద్రబాబు విచ్చలవిడిగా వాడుకున్నాడు. కాబట్టే దీనిపై చర్చించాలని పదే పదే మండలిలో నిలదీసినప్పటికీ ప్రభుత్వం వెనుకడుగు వేసింది.
    ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడకపోయి ఉంటే చర్చకు ఎందుకు భయపడ్డారు? ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో టీటీడీ నిధులు దోచుకోవడానికి టెండర్‌ నిబంధనలు మార్చడం, డిస్‌ క్వాలిఫై అయినప్పటికీ వెంటనే ఎత్తివేయడం లాంటి చర్యల ద్వారా చంద్రబాబు వందల కోట్ల అవినీతికి పాల్పడినట్టు రుజువైంది. దేవుడంటే కూటమి నాయకులకు భయం, భక్తి ఉంటే.. టీటీడీ నిధులు దోచుకుని అవినీతికి పాల్పడలేదు అనేది నిజమైతే  ఇందాపూర్, హెరిటేజ్‌ డెయిరీల సంబంధం గురించి సభలో చర్చ పెట్టాలి.  

బూట్లతో పూజలు చేసే నైజం చంద్రబాబుది:
    ఇందాపూర్‌ ముసుగులో టీటీడీ నిధులు దోపిడీపై చంద్రబాబు అవినీతిపై చర్చకు రమ్మంటే వైయస్సార్సీపీ సభ్యులు బూట్లు వేసుకుని శ్రీ వేంకటేశ్వరుడి చిత్రపటాలను పట్టుకెళ్లారని మరో తప్పుడు ప్రచారం చేస్తూ కుంటి సాకులు వెతుకుతున్నారు. మేం అలా చేసి ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేస్తున్నా. దేవుడి ఫొటోతో బూట్లు వేసుకుని నడిచే చరిత్ర చంద్రబాబుకే ఉంది. బూట్లు వేసుకుని అమరావతికి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. ఇలాంటిది కూటమి నాయకులు మాపై బురదజల్లడం సిగ్గుచేటు. చెప్పులు విప్పి.. స్వామి వారి చిత్రపటాలతో రక్షించు గోవిందా... కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించు గోవిందా.. అని నినదించాం. ఆ తర్వాత ఆ ఫొటోలు నేనే స్వయంగా తీసుకొచ్చి టేబుల్‌పై పెట్టా. ఇందాపూర్‌తో హెరిటేజ్‌కి ఉన్న సంబంధాలపై చర్చించమని డిమాండ్‌ చేస్తే దానికి సమాధానాలు చెప్పుకోలేకనే ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది.
    మంత్రులుగా ఉండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెరిటేజ్‌ తరఫున మాట్లాడటం దేనికి సంకేతం? హెరిటేజ్‌ యాజమాన్యం కన్నా ఎక్కువగా మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలే స్పందిస్తున్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లూ తిరుమల ప్రతిష్టను దిగజార్చి రాజకీయాలు చేసిన కూటమి నాయకులు.. ఇందాపూర్‌తో హెరిటేజ్‌ కి ఉన్న సంబంధం బయటపడిన తర్వాత దేవుడి ప్రతిష్ట అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా హెరిటేజ్, ఇందాపూర్‌ డెయిరీ సంబంధంపై మండలిలో చర్చ పెట్టమనే వైయస్సార్సీపీ డిమాండ్‌ చేస్తోంది.  

ఫుటేజ్‌ విడుదలపై మండలి చైర్మన్‌కి ఫిర్యాదు చేస్తాం 
:లేళ్ల అప్పిరెడ్డి, వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ 

– దేశంలో ప్రధానులు, రాష్ట్రపతులను నేనే నియమించానని చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నాడు. రాజకీయ లబ్ధి కోసం లడ్డూ వివాదానికి తెరలేపిన చంద్రబాబు తిరుమల ప్రతిష్టను పూర్తిగా మంటగలిపేశాడు. తమ రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రతను, హిందూ ధర్మాన్ని మంటగలిపిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లను ప్రశ్నించాల్సిందిపోయి బీజేపీ నాయకులు వైయస్సార్సీపీని క్షమాపణలు కోరడం హాస్యాస్పదంగా ఉంది. బూటు కాళ్లతో శంకుస్థాపనలు చేసిన చంద్రబాబు, ఆధారాలు లేకుండా ఆయోధ్యపై మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌ లను బీజేపీ నాయకులు ప్రశ్నించలేకపోతున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో మడిపడిన అంశం కాబట్టి బీజేపీకి చేతనైతే ఇందాపూర్, హెరిటేజ్‌ డెయిరీల మధ్య ఉన్న అనుబంధం గురించి చర్చకు ఒప్పించాలి. మేం సీట్ల నుంచి పోడియం వద్దకు వచ్చేటప్పుడు ఉన్న వీడియాలు కట్‌ చేసి ప్రచారం చేసుకుంటున్నారు. దమ్ముంటే పోడియం వద్ద ఉన్న వీడియోలు రిలీజ్‌ చేయాలి. మేం సభ నుంచి బయటకు రాకముందే వీడియో ఎలా బయటకు వచ్చింది?  దీనిపై మండలి చైర్మన్‌కి ఫిర్యాదు చేస్తాం. 

ఆలయాలను కూల్చిన చంద్రబాబు హిందువుల ప్రతినిధా? 
:మొండితోక అరుణ్‌ కుమార్, వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ 

– హెరిటేజ్, ఇందాపూర్‌ డెయిరీల మధ్య ఉన్న సంబంధం గురించి చర్చించాలని నాలుగు రోజులుగా వైయస్సార్సీపీ పట్టుబడుతుంటే వాయిదా తీర్మాణాన్ని అంగీకరించకుండా సభను వాయిదా వేస్తున్నారు. హెరిటేజ్‌ అవినీతి బాగోతం, కల్తీ నెయ్యి ముసుగులో జరిగిన టీటీడీ నిధులు దొపిడీ గురించి ప్రపంచానికి తెలుస్తుందనే భయంతో చర్చకు రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుపడుతోంది. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్‌ చేసిన బాగోతాలన్నీ ప్రజలకు అర్థమైపోయాయి. టీటీడీ నిధుల దోపిడీని అడ్డుకుంటుంటే వైయస్సార్సీపీ హిందూ వ్యతిరేక పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆలయాలను కూల్చేసి, బూట్లు వేసుకుని పూజలు చేసిన చంద్రబాబుని హిందువుల ప్రతినిధి అంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడటం బాధాకరం. మండలి చైర్మన్‌ను ఉద్దేశించి మీ పార్టీ అని హోంమంత్రి అనిత మాట్లాడటం సభ మర్యాదలను, చైర్మన్‌ నిజాయితీని అవమానించడమే అవుతుంది. రాజకీయ లబ్దికోసం ఎవరి మీదైనా నిందలు మోపడం, ఎవరినైనా వాడుకోవడం చంద్రబాబుకి అలవాటు. దమ్ముంటే ఇందాపూర్‌ పాత్రపై కూటమి నాయకులు చర్చకు అంగీకరించాలి. 

పదే పదే దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు
:తోట త్రిమూర్తులు. వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ 

– ఇన్నాళ్లూ కల్తీ నెయ్యి పేరుతో తిరుమల శ్రీవారి లడ్డూ మీద దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని కుటిల ప్రయత్నాలు చేసిన కూటమి నాయకులు, ఇప్పుడు మరోసారి దేవుడిని రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు మాదిరిగా బూట్లు ధరించి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నాయకుడు ఎవరైనా ఉంటే జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు చూపించాలి. వైయస్సార్సీపీ సభ్యులు దేవుడిని అవమానించారంటూ ఊగిపోతూ మాట్లాడిన కూటమి నాయకులు సమాధానం చెప్పాలి. పదే పదే దేవుడిని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమైన చర్య. ఆధారాలు లేకుండా లడ్డూ వివాదానికి తెరలేపిన చంద్రబాబు మండలిలో చర్చకు అంగీకరిస్తే ఆధారాలతో వివాదానికి వైయస్సార్సీపీ ముగింపు పలుకుతుంది. తప్పు ఎవరు చేశారో ప్రజలే నిర్ణయిస్తారు. 

బడ్జెట్‌పై చర్చను పక్కదారి పట్టించడానికే.
:బొమ్ము ఇజ్రాయేల్‌. వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ 

– లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్‌ సాక్షిగా నిర్ధారణ అయిన తర్వాత కూడా చంద్రబాబు సహా కూటమి నాయకులు తిరుమలపై దుష్ప్రచారం ఆపలేదు. జంతువుల కొవ్వుతో తయారు చేసిన లక్ష లడ్డూలు అయోధ్యకు పంపారని ఆరోపించిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సిట్‌ చార్జిషీట్‌ తర్వాత ఎందుకు నోరు మెదపడం లేదు?  బడ్జెట్‌ను పక్కదారి పట్టించడం కోసం మరోసారి లడ్డూ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఇప్పటికైనా చర్చకు సిద్ధమైతే ముందుకు రావాలి. 

నెయ్యి ధర పెంచుకోవడానికే దిగజారుడు వ్యాఖ్యలు
:తూమాటి మాధవరావు, వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ 

– సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్‌ నివేదికను కూటమి నాయకులు విశ్వసించలేకపోతున్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు పశ్చాత్తాపం చెంది దేవుడిని క్షమాపణలు కోరాల్సింది పోయి, నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందన్న అక్కసుతో దేవుడి మీద బరి తెగించి ఆరోపణలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తిరుమల లడ్డూ వివాదం సమసి పోవడం ఇష్టం లేక రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ప్రసాదాలు కూడా కల్తీ అయ్యాయని దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. కేజీ రూ.300 లకు సరఫరా చేసే నెయ్యి ధర పెంచి టెండర్లు పిలవడానికే ఇలాంటి ఆరోపణలు చేశారని నిర్ధారణ అయిపోయింది. 2014–19 మధ్య టీటీడీ నెయ్యి సప్లై కాంట్రాక్టుల పేరుతో చేసిన అవినీతి మొత్తం బయటకొచ్చింది. ఆర్థిక లబ్ధి కోసం దేవదేవుడిని రాజకీయాల్లోకి లాగిన కూటమి నాయకులను ప్రజలు క్షమించరు. వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. 

అనితకు జగన్‌ గారి పేరెత్తే అర్హత లేదు
:వరుదు కళ్యాణి, వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ

– ఏడాదిన్నర కాలంగా స్వామి వారిని రాజకీయాల్లోకి లాగుతూ చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడు. దేవుడి ముసుగులో ఆయన చేసిన అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిపై నడి రోడ్డు మీద ఫ్లెక్సీలు వేసి అవమానించారు. ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేసినందుకు, సీబీఐ సిట్‌ చార్జిషీట్‌ తర్వాత అది నిజం కాదని తేలినా బాత్రూమ్‌ కెమికల్స్‌ కలిశాయంటూ ప్రచారం చేసినందుకు చంద్రబాబు భక్తులకు క్షమాపణలు చెప్పాలి. హెరిటేజ్‌ తో ఇందాపూర్‌ డెయిరీకి వ్యాపార సంబంధాలున్న విషయం బయటపడ్డాక అవినీతి వ్యవహారంలో చంద్రబాబు నిండా మునిగిపోయాడు. దాన్నుంచి బయటపడలేక శ్రీవారి ఫొటోలంటూ కూటమి నాయకులు హడావుడి చేస్తున్నారు. చేతనైతే తిరుమల లడ్డూ, ఇందాపూర్‌తో హెరిటేజ్‌కి ఉన్న సంబంధాలపై సభలో చర్చించాలి. మద్యం షాపులు, పేకాట క్లబ్బులు, ఇసుక లారీలు, ఆఖరుకి పశువుల లారీల దగ్గర కూడా పీఏలను పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకునే హోంమంత్రి అనిత నోటికొచ్చినట్టు వైయస్‌ జగన్‌ గారి గురించి మాట్లాడటం సమంజసం కాదు. ఆమెకు వైయస్‌ జగన్‌ గారి పేరెత్తే అర్హత కూడా లేదు. అధికారమదంతో కళ్లు మూసుకుపోయి ఏం మాట్లాడుతుందో ఆమెకు తెలియడం లేదు. 

హెరిటేజ్‌ అవినీతి బయటకొస్తుందని భయం
:కల్పలతా రెడ్డి, వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ

– ఏడాదిన్నర కాలంగా తిరుమల లడ్డూ పేరుతో ఆధారాలు లేకుండా కూటమి నాయకులు ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు. ఎల్లో మీడియాలో వార్తలు రాయించి, టీవీల్లో డిబేట్లు పెట్టించి పదే పదే శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారు. జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్‌ చెప్పినప్పటికీ వారిలో మార్పు రాకపోగా మరింత బరితెగించారు. ఇందాపూర్‌ డెయిరీతో హెరిటేజ్‌కి ఉన్న సంబంధాలపై చర్చించాలని వైయస్సార్సీపీ డిమాండ్‌ చేస్తుంటే కూటమి వణికిపోతోంది. చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ అవినీతి బాగోతం బయటకొస్తుందని అల్లాడిపోతున్నారు. టీటీడీ నిధుల దోపిడీ కోసం స్వామి వారి మీద చేసిన తప్పుడు ప్రచారం ప్రజలకు అర్థమైంది. వారు చేసిన పాపాలకు తప్పకుండా మూల్యం చెల్లించకతప్పదు. 

కూటమి నాయకులే క్షమాపణలు చెప్పాలి
:పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి. ఎమ్మెల్సీ

– తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించేలా బ్రిటీష్‌ పాలకులు కూడా ఏనాడూ మాట్లాడలేదు. కానీ చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఏడాదిన్నర కాలంగా తిరుమల గురించి ఎన్నో అసత్యాలు ప్రచారం చేసి శ్రీవారి ప్రతిష్టపై ప్రజలలో అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరించారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రపంచంలోని హిందువులంతా నివ్వెరపోయారు. చివరికి సీబీఐ సిట్‌ చార్జిషీట్‌ మూలంగా నిజం కాదని తేలడంతో శ్రీవారి భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. వారు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటపడిపోవడంతో సమాధానం చెప్పలేక కూటమి నాయకులు తెల్లమొహం వేస్తున్నారు. దాన్నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయడానికి కొత్తగా వైయస్సార్సీపీ సభ్యులు చెప్పులేసుకుని స్వామి వారి చిత్రపటాలు పట్టుకున్నారని ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో సభలో ఎమ్మెల్యే బాలకష్ట, పయ్యావుల కేశవ్‌ విజిల్స్‌ వేశారు. మంత్రిగా ఉన్నప్పుడు విడదల రజిని గారు మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులు సభలోకి చిడతలు తెచ్చి నానా యాగీ చేసి సభని అగౌరవ పరిచారు. తాళిబొట్లతో సభలోకి ప్రవేశించి వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని కించపరిచారు. అడుగడుగునా వారు తప్పులు చేసి వైయస్సార్సీపీ మీద నిందలు మోపడం వారి చేతకానితనానికి నిదర్శనం. వేంకటేశ్వరస్వామిని అవమానించినందుకు కూటమి నాయకులు క్షమాపణలు చెప్పాలి. 

చర్చ జరిగితే తప్పు చేసిందెవరో తేలుతుంది
:సానిపల్లి మంగమ్మ, వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ

– కూటమి నాయకులకు దేవుడంటే భయం కానీ భక్తి కానీ లేదు. ఏడాదిన్నర కాలంగా దేవుడిని రాజకీయాల్లోకి పబ్బం గడుపుతున్నారు. హెరిటేజ్‌ డెయిరీతో ఇందాపూర్‌ డెయిరీకి ఉన్న సంబంధం గురించి చర్చకు రమ్మంటే వైయస్సార్సీపీ సభ్యులు చెప్పులేసుకుని దేవుడి చిత్రపటాలు పట్టుకున్నారని వితండవాదన చేస్తున్నారు. హెరిటేజ్‌ అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు చర్చకు అడ్డుపడుతున్నారు. బయట మీడియా ముందు మేం చర్చకు సిద్దం అంటూనే సభలో మాత్రం చర్చకు అనుమతిండం లేదు. లడ్డూపై చర్చ జరిగితే కల్తీ ఎవరు చేశారో ప్రజలకు తెలుస్తుంది.

Back to Top