కూటమి ప్రభుత్వంలో గాడి తప్పిన పాలన

కష్టాల్లో రాష్ట్ర ప్రజలు

గాల్లో విహరిస్తున్న పాలకులు

సంక్షేమం ఊసే లేని బడ్జెట్ 

కూటమి పాలనపై మండిపడ్డ వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకరరావు

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు.

ఆత్మస్తుతి... పరనింద

పబ్లిసిటీ పీక్‌... పర్ఫార్మెన్స్‌ వీక్‌

నిత్యం జగన్‌ నామ స్మరణ

వైయ‌స్ఆర్‌సీపీపై బురద చల్లడమే లక్ష్యం

పాలనలో వైఫల్యం- ప్రతిచోటా తప్పిదాలు

ఇదే 20 నెలలుగా సాగిన కూటమి పాలన

స్పష్టం చేసిన జూపూడి ప్రభాకరరావు

సంస్కరణలకు ఆద్యుడు వైయస్ జగన్

విధ్వంసానికి మారుపేరు చంద్రబాబు

తేల్చి చెప్పిన వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకరరావు

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రజల కష్టాలను పట్టించు కోకుండా ప్రభుత్వ పెద్దలు గాల్లో విహరిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకరరావు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ లో లెక్కలతో సహా వివరించిన అంశాలు అక్షర సత్యాలని పేర్కొన్నారు. వైయస్ జగన్ హయాంలో రైతులకు భరోసానిచ్చే ఆర్బీకేలు, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాడు-నేడు, మహిళా సాధికారిత కోసం అందించిన సంక్షేమ పథకాలు కళ్ళముందే కనిపిస్తున్నాయని జూపూడి  స్పష్టం చేశారు. వైయస్.జగన్  "జగన్ గారు ప్రజల కోసం సంస్కరణలు చేపడితే.. చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్న ప్రతి గొంతును నొక్కుతూ 'విధ్వంసకర పాలన' సాగిస్తున్నారని తేల్చి చెప్పారు. మాట్లాడిన వారిని అరెస్టు చేయడం, జైళ్లకు పంపడం తప్ప ఈ ప్రభుత్వానికి మరేమీ చేతకావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేదని, హాస్టళ్లలో వందలాది మంది పిల్లలు అనారోగ్యం పాలవుతున్నా.. పాలకులు మాత్రం ప్రతి వారాంతం హైదరాబాద్ వెళ్లడానికి స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లలో విహరిస్తూ ప్రజాధనాన్ని విచ్చలవిడి దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్. జగన్ తన ప్రెస్ మీట్ లో ఆధారాలతో చూపించిన లెక్కలకు సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. వైయస్. జగన్  ప్రెస్ మీట్ ను ప్రతి ఒక్కరూ వీక్షించి, వాస్తవాలను తెలుసుకోవాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా  పాలకులు  గాల్లో విహరించడం మానేసి ప్రజల కష్టాల వైపు చూడాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

● సంస్కరణలకు ఆద్యుడు వైయస్.జగన్..

వైయస్.జగన్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర మాత్రమే కాకుండా.. వారు ఇబ్బందులలో ఉంటే నష్టపోకుండా ఉండడానికి ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. అదే విధంగా పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలడానికి అవసరమైన సంస్కరణలు విద్యావ్యవస్ధలో తీసుకొచ్చారు.  ప్రభుత్వ స్కూళ్లను అత్యాధునికంగా నాడు నేడు ద్వారా తీసుకురావడం వంటి మార్పులను వైయస్.జగన్ చేపట్టారు. రాష్ట్రంలో మహిళా సాధికారిత కోసం వారిపేరు మీద ఇళ్లపట్టాలతో పాటు అనేక సంక్షేమపథకాలు తీసుకొచ్చారు. విద్యార్ధులకు, నిరుద్యోగులకు వైయస్.జగన్ ఇచ్చిన పథకాల కంటే అధికంగా ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు అనేక హామీలిచ్చారు. గ్రామాల్లో మహిళలు చెబుతున్నారు.. మేం కూటమి ఓట్లేయలేదు వాళ్లే గుద్దుకున్నారని చెప్పారు. పరకాల ప్రభాకర్  వైర్ కి రాసిన వ్యాసం, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. రాత్రి 11 గంటల నుంచి ఏ విధంగా ఓట్లేసుకుని ఎలా గెలిచారో అన్నదానిపై అందరికీ అనుమానాలున్నాయి. అయినా గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకీ మీరు అన్యాయం చేశారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా వైయస్.జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారు.

● మీది విధ్వంసం పాలన కాదా?

కానీ చంద్రబాబు మీ హామీల అమలు గురించి అడిగిన ప్రతిసారీ విధ్వంసాన్నే ఎంచుకున్నారు. మిమ్నల్ని ప్రశ్నించిన ప్రతి గొంతుని పోలీస్ స్టేషన్ కి ఈడ్చారు. మాట్లాడిన ప్రతి వారిని అరెస్టు చేసి కోర్టుల కీడ్చి, జైళ్లకు పంపించారు. అంటే ప్రశ్నిస్తున్న ప్రతి గొంతుని నొక్కాలని, అణిచివేయాలని, వీలైతే శాశ్వతంగా లేకుండా చేయాలని వక్రమార్గంలో మీరు చేస్తున్న మీ ప్రయత్నాన్నే విధ్వంసం అంటారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా పాలన మీకు చేతకావడం లేదు. కరోనా లాంటి విపత్తులున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన అందించిన వైయస్.జగన్ ప్రభుత్వాన్ని విధ్వంసం అంటూ.. మీరు చేయాల్సిన పనులు చేయకుండా సమాజాన్ని విధ్వంసం చేస్తుంది మీరు. కూటమి ప్రభుత్వం వచ్చాక హాస్టళ్లలో 900 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.

● పాలన గాలికొదిలి గాల్లో విహరిస్తున్న పాలకులు...

ప్రజలు భూమ్మీద ఇబ్బందులు పడుతుంటే... ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలి పాలకులు మాత్రం గాల్లో విహరిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలపై కేసులు ఉండడం లేదు. బడ్జెట్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలనే వైయస్.జగన్ ప్రశ్నించారు. అసలు పాలన ఉందా? లేదా? అన్న ప్రశ్నకు బదులేది?  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామలు. ప్రభుత్వ వైఫల్యాలు. ప్రజల ఇబ్బందుల. ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది?.. వీటన్నింటినీ నిన్న జగన్‌గారు తన సుదీర్ఘ ప్రెస్‌మీట్‌లో స్పష్టమైన ఆధారాలతో సహా చూపారు. వార్షిక బడ్జెట్లలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీ, మసి పూరి మారేడుకాయ చేస్తున్న వైనాన్ని కూడా ఆయన చక్కగా వివరించారు. కాబట్టి, జగన్‌గారి ప్రెస్‌మీట్‌  కాస్త టైమ్‌ తీసుకుని చూడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం వైయస్.జగన్ ను నిందించడానికే హోమ్ మంత్రి పదవిని మహిళకు అప్పగించారు. శాంతిభద్రతల పరిరక్షణపై మాత్రం ఆమె నోరు మెదపరు. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెర్స్, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తంది. ప్రైవేటు ముఖ్యమంత్రి తరహాలో ఏపీలో పాలన సాగుతోంది. 54 లక్షల ఓట్లను అరగంటలో మీరే వేసుకుని గెల్చిన విధానంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.  ఈ ప్రభుత్వం మీద రైతులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్ధులు ఎవ్వరూ నమ్మకంగా లేరు. మరి అలాంటప్పుడు ఏ రకమైన పాలన మీరు సాగిస్తున్నారు? ఎకరా 99 పైసలకే  మీరు ఎవరికైతే ఇచ్చారో.. వారే మిమ్నల్ని వారే ఇలా స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. పసిపిల్లలపై లైంగిక అకృత్యాలకు పాల్పడినందుకు  70 ఏళ్ల వయస్సులో ఉన్న బిల్ గేట్స్ కి ఆయన భార్య మిలిందా గేట్స్ విడాకులు ఇచ్చారు. అలాంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చారు.  ఏ లక్ష్యాలతో ఆయన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? 

● రూ.3.22 లక్షల కోట్లు అప్పు సంపద సృష్టా?...

సంపద సృష్టిస్తానని చెప్పిన మీరు 20 నెలల పాలనలో రూ.3.22లక్షల కోట్లు అప్పు చేశారు. మీరు సృష్టించిన సంపద ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు మీరు అందించిన సంక్షేమపథకాలు ఎక్కడ? ఎవరికి అందిస్తున్నారు? ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మాది విధ్వంసం అని ఎదురుదాడి చేస్తున్నారు. ప్రశ్నిస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో  2019-24 వరకు మాత్రమే కాకుండా గతంలో కూడా లడ్డూ ప్రసాదంపై ఎందుకు విచారణ చేయించరు.  వైయ‌స్ఆర్‌సీపీ తరపున ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ టెస్ట్ కి పెట్టగలరా? మీ పరిపాలన ఎక్కడ సాగుతోంది. అదే విషయంపై మీది  గాల్లో తిరుగుతున్న ప్రభుత్వం అని వైయస్.జగన్ ప్రశ్నించారు.  చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అధోగతి పాలైంది. పరిపాలన అనేది పూర్తిగా గాడి తప్పింది. ఎక్కడా అడ్మినిస్ట్రేషన్‌ అనేది లేకుండా పోయింది.  మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేదు. చివరకు తమ శాఖలో ఏం జరుగుతుందో కూడా మంత్రులు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. చివరకు రివ్యూ మీటింగ్స్‌ కూడా కనుమరుగయ్యాయి.

● ప్రజాధనం విచ్చలవిడి దుర్వినియోగం...

అంతా త్రీ మెన్‌ షో. సీఎం చంద్రబాబు. ఆయన కుమారుడు సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్‌. చంద్రబాబు దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌. ఈ ముగ్గురూ కూడా వీకెండ్స్‌లో రాష్ట్రంలో ఉండరు. ప్రతి వారాంతం మా పయనం హైదరాబాద్‌ అన్నట్లుగా వారి టూర్లు కొనసాగుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా హెలికాప్టర్‌. స్పెషల్‌ ఫ్లైట్‌. అందుకోసం విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పాలన అన్నది లేకుండా పోయింది. 

● ఇవి కళ్ల ముందే కనిపించే వాస్తవాలు... 

గత ప్రభుత్వ బడ్జెట్ కి ఇప్పటి బడ్జెట్ కి ఉన్న తేడా, ఎవరేం చేశారు అన్న విషయాలను వైయస్.జగన్ తన ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా ఆధారాలు, లెక్కలతో సహా వివరించారు. అంత పచ్చి నిజాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. వాస్తవం ఏమిటనేది మా పార్టీ నేత చాలా స్పష్టంగా ఆధారాలతో సహా, చెప్పినా, చంద్రబాబు తన వైఖరి మార్చుకోవడం లేదు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే, గోబెల్స్‌ ప్రచారం చేస్తే, ప్రజలు అదే నమ్ముతారనేది చంద్రబాబు నమ్మకం. ముందు నుంచి ఆయనది అదే వైఖరి. కేవలం మీడియా బలం, సహకారంతోనే నెట్టుకొస్తున్నాడు. ప్రజల తరపున వైయస్.జగన్ మాట్లాడుతుంటే ఒక్కొక్కరిని అరెస్టు చేసి కేసులు పెడుతూ.. చివరికి ఆయన వరకూ వస్తారని చెబుతున్నారు. ప్రజలను గాలికొదిలేసిన మీరు ఏ రకమైన నిర్మాణాలు లేవు, చివరకు ఐదు ఎకరాల్లో నారా వారి కోట మాత్రమే కనబడబోతుంది.  మీరు చెప్పినట్లు వైయస్.జగన్ ది ప్యాలెస్ కాదు ఇది వేలాదిమంది కార్యకర్తలు వచ్చే పార్టీ ఆఫీస్ కమ్ రెసిడెన్స్. టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాను హైదారాబాద్ లో చంద్రబాబు అద్దాల మేడలోకి ఎప్పుడైనా వెళ్లారా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వ పెద్దలు ప్రజలకు అందుబాటులో  లేకుండా, ప్రత్యేక విమానాల్లో గాల్లో తిరుగుతున్నారు. మీది విధ్వంసమా? ప్రజల కోసం అద్భుతమైన పరిపాలన అందించిన వైయస్.జగన్  పాలన విధ్వంసమా?  అని జూపూడి ప్రభాకరరావు సూటిగా ప్రశ్నించారు. అందుకే వైయస్.జగన్ కూటమి ప్రభుత్వ పాలన, బడ్జెట్ పై ఆధారాలు, సాక్ష్యాలతో సహా వైయస్.జగన్ వివరించారని.. రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అధోగతి పాలవడానికి చంద్రబాబు వైఖరే కారణమని, ఇప్పటికైనా గాల్లో విహరించడం మానేసి ప్రజల కష్టాల వైపు చూడాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్  చేశారు.

Back to Top