కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం 

డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజా సమస్యలను గాలికొదిలిన వైనం

చంద్రబాబు సర్కార్ పై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజం.

తాడేపల్లి లోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే 
శైలజానాథ్.

డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు సర్కార్.

రైతుల కన్నీళ్లు కనిపిస్తున్నా.. కూటమి ప్రభుత్వానికి కనికరం లేదు.

వరి మద్దతు ధర రూ.2400 ఉంటే.. రూ. 1400కే అమ్ముకోవాలా?

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం.

డీయస్సీ స్పోర్ట్స్ కోటా కుంభకోణం.. ఆ 'ముఖ్య నేత' ఎవరో చెప్పాలి.

విశాఖ ఎంపీకి రూ. 5 వేల కోట్ల భూమి ధారాదత్తం.. రాష్ట్రం మీ జాగీరా?

రూ.3.50 లక్షల కోట్ల అప్పు ఎవరి జేబులోకి పోయింది?

అమరావతిలో నీళ్లు తోడటానికి రూ.800 కోట్లు.

రాయలసీమ ప్రాజెక్టులకు మాత్రం నిధులు లేవా?

కూటమి పాలనపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఫైర్

మద్యం, ఇసుక దోపిడీలో 90 శాతం టీడీపీ నేతలదే హవా.

గంజాయి మహమ్మారితో యువత నిర్వీర్యం

గాలిలో కలిసిన శాంతిభద్రతలు 

వైయస్.జగన్ పై తప్పుడు ప్రచారాలు మానండి

లేకపోతే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం

హెచ్చరించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్

తాడేపల్లి: విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని నమ్మబలికిన కూటమి ప్రభుత్వం, రెండేళ్ల పాలనలో ప్రజలకు కన్నీళ్లు, కష్టాలను మాత్రమే మిగిల్చిందని వైయ‌స్ఆర్‌సీపీ  సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ విమర్శించారు. శుక్రవారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుతో సహా మంత్రులందరూ తమ శాఖల పనితీరును పక్కనపెట్టి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలిందని, వరి, మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర లభించక అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ వంటి కీలక అంశాలను గాలికి వదిలేసి.. అమరావతిలో నీటిని తోడటం కోసం వేల కోట్లు వృధా చేస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు విశాఖ ఎంపీ వంటి అస్మదీయులకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతూ, దేవాదాయ భూములను సైతం దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డైవర్షన్ రాజకీయాలు మానుకుని, రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి సమస్య, గంజాయి మహమ్మారి, గిట్టుబాటు ధరల వంటి వాస్తవ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..

- రైతాంగం విలవిల – గిట్టుబాటు ధర మృగ్యం..

రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. వరి కనీస మద్దతు ధర రూ. 2400 ఉంటే, రైతులు రూ. 1400కే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. మిరప, కోకో, మొక్కజొన్న రైతులకు కనీస మద్ధతు ధరల ఊసేలేదు. ఏపీలో ధర లేక రైతులు తమ వడ్లను తెలంగాణకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్న నేతలు కేంద్రం నుండి ఏ రకమైన సాయం తెచ్చారో చెప్పాలి. 

- విద్యాశాఖలో గందరగోళం – నిరుద్యోగుల వంచన..

విద్యార్ధుల గురించి కనీసం ఆలోచన చేయడం లేదు. మాట్లాడితే స్విట్జర్లాండ్, సింగపూర్ వెళ్లానని చెప్పే విద్యాశాఖ మంత్రికి తన శాఖ పరిధిలో పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కూడా సరిగా జరగడం లేదన్న విషయం తెలియదా? అదే విధంగా మీరు నిర్వహించిన డియస్సీలో స్పోర్ట్స్ కోటాలా చాలా అన్యాయం జరిగింది, కోట్లాది రూపాయలు చేతులు మారాయని ముఖ్యనేత పేరు చెబుతున్నారు. ఆ ముఖ్యనేత ఎవరో మీకు తెలిసే ఉంటుంది. దాని గురించి మీరు మాట్లాడరా మంత్రి గారూ? అప్పుడెప్పుడో జాబ్ కేలండర్ ప్రకటించారు. విద్యాశాఖలో 25వేలు, ఇంజనీరింగ్ విభాగంలో 25వేలు, మరో 5వేల ఇతర ఉద్యోగాలు ఖాలీలున్నాయని చెప్పారు. కానీ ఇటీవల మీరు కేవలం 10వేల ఉద్యోగాలు భర్తీకి మాత్రమే ప్రకటించారు. అంటే మీ శాఖాధికారులు మిమ్నల్ని కూడా మోసం చేస్తున్నారా? లేదా ఎన్నికలప్పుడు ఓట్లు కోసం తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేశారా?
మరోవైపు కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ మీరు చెల్లించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్ధులకు కాలేజీల యాజమాన్యాలు హాల్ టిక్కెట్లు ఇవ్వడం లేదు. గతేడాది కాలంలో వసతి గృహాల్లో అనారోగ్యం పాలై అనేకమంది పిల్లలు మృత్యువాత పడ్డారు.

- భూదోపిడీ - అస్మదీయులకు కట్టబెట్టడమే పని..

రాష్ట్రం మీ జాగీరు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విశాఖ ఎంపీకి చెందిన గీతం విద్యాసంస్థలకు రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. వీలైనన్ని ప్రాంతాలలో ప్రజల ఆస్తులను పావలాకి, 50 పైసలకి 99 పైసలకి మీ అస్మదీయులకి అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.  రాష్ట్రం మీ జాగీరు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

- అమరావతి కోసం అప్పులు – రాయలసీమకు అన్యాయం

రాష్ట్రంపై రూ. 3.50 లక్షల కోట్ల అప్పుల భారం మోపి, ఆ డబ్బంతా ఎటు పోతుందో చెప్పడం లేదు. 
రాయలసీమలో నీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతుంటే, అమరావతిలో నీటిని తోడటానికే రూ. 800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. గాలేరు నగరి అనుసంధానానికి రూ. 1000 కోట్లు ఇస్తే అనంతపురం, కర్నూలు జిల్లాలు బాగుపడతాయి, కానీ ఆ పని చేయడం లేదు. వైయస్.జగన్  ప్రతిపాదించిన 'మావిగన్' అభివృద్ధికి సమాధానం చెప్పలేక ప్రభుత్వం నోటికొచ్చినట్లు మాట్లాడుతోందన్నారు.

- లిక్కర్, ఇసుక, గంజాయి మాఫియా..

రాష్ట్రంలో 90 శాతం మద్యం షాపులు టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి, ప్రతి బాటిల్ మీద రూ. 10 నుండి రూ. 50 అదనంగా వసూలు చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో రాత్రిపూట టిప్పర్లలో ఇసుక తరలిపోతోందని, గంజాయి వల్ల యువత నిర్వీర్యం అవుతోంది. 

ఈ నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా అసత్య ప్రచారాలు, పక్కదారి పట్టించే రాజకీయాలు మానుకోవాలని సాకే శైలజానాథ్ హితవు పలికారు. కేవలం అమరావతి అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల అప్పులు తెచ్చి, రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాల నోరు కొట్టడం భావ్యం కాదని హెచ్చరించారు. రైతుల గిట్టుబాటు ధరలు, నిరుద్యోగుల ఉద్యోగ కల్పన, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి మౌలిక సమస్యలను పరిష్కరించకుండా.. కేవలం అస్మదీయులకు భూములు కట్టబెట్టడమే ధ్యేయంగా పాలన సాగించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా  డైవర్షన్ చేయడానికి ప్రయత్నస్తే..... వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సాకే శైలజానాథ్ హెచ్చరించారు.

Back to Top