శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి వైయస్ఆర్‌సీపీ నాయకులు కార్యాచరణ వేగవంతం చేశారు. పెనుకొండ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో జిల్లాస్థాయి బూత్ కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్, రాష్ట్ర బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ అబ్జర్వర్ రమేష్ రెడ్డి, మడకశిర సమన్వయకర్త ఈరలకప్ప, హిందూపురం సమన్వయకర్త దీపికా తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యంగా పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. పంచాయతీ స్థాయి బూత్ కన్వీనర్లు, మండల మరియు నియోజకవర్గ స్థాయి నాయకులకు ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా సవరణలు, బూత్ స్థాయి కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ పార్టీ బూత్ స్థాయిలో బలంగా ఉండటం ఎన్నికల విజయానికి కీలకమని తెలిపారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఓటర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు. నాయకులు మాట్లాడుతూ SIR ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు. బూత్ కమిటీలు సమన్వయంతో పనిచేస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల బూత్ కన్వీనర్లు, మండల స్థాయి బాధ్యులు, పంచాయతీ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.