రావులపాలెం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని, అలాగే కొత్తపేట నియోజకవర్గం నుంచి చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. రాష్ట్ర ఇంటెలెక్చువల్ విభాగం కార్యదర్శి కొడమంచిలి హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్ర రావులపాలెం నుంచి గుణదల మేరీ మాత కొండ వరకు భక్తి, సంకల్పంతో కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైయస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 2029లో మళ్లీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని, కొత్తపేట నియోజకవర్గంలో చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వానికి మరింత బలం చేకూరుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.