ఇందాపూర్‌,హెరిటేజ్‌ లింకులపై చర్చించాలి 

మండ‌లిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్‌

అమరావతి: మండలిలో వైయ‌స్ఆర్‌సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. తిరుపతి లడ్డూ ప్రసాద అంశం, హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ, టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం చేశారు. శాసనమండలికి ర్యాలీ వచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు.. భోలే బాబా.. చంద్రబాబా.. చంద్రబాబా.. ఆలీబాబా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. 
ఇందాపూర్‌, హెరిటేజ్‌ లింకులపై చర్చించాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్‌ చేసింది. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు నిందలు మోపారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. దేవదేవుడి ధనాన్ని లూటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాబు ప్రభుత్వం పెట్టిన డొల్ల బడ్జెట్‌పై చర్చ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

Back to Top