విజయనగరం జిల్లా: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ రాజేష్ తలే ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటారు వాహనాన్ని పడుకోబెట్టి దానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజాం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్మోహన్‌రావు, నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.