ప్రొద్దుటూరులో భారీ నిరసన

వైయ‌స్ఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ప్రొద్దుటూరులో వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన ధరలు అధికంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి  ఆందోళన చేపట్టారు.  ఈ సందర్భంగా ఆయన వినూత్నంగా ఆటో నడుపుతూ తన నిరసనను వ్యక్తం చేశారు. పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజలు, రైతులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మరింత భారం మోపుతోందని మండిపడ్డారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఎంఆర్వో కార్యాలయానికి వెళ్లిన రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్వోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Back to Top