దమ్ముంటే చంద్రబాబు నాతో చర్చకు రావాలి..

 శ్రీ‌కాకుళం:  చంద్ర‌బాబుకు ద‌మ్ముంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై త‌న‌తో చ‌ర్చ‌కు రావాల‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు స‌వాలు విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గార, శ్రీకూర్మం సభల్లో రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు పార్లమెంటు అభ్యర్థి  పేరాడ తిలక్ పాల్గొన్నారు . 
    ఈ సభ లో ధర్మాన చంద్ర బాబు కి టైటిలింగ్ యాక్ట్ మీద సవాలు విసిరారు. చంద్రబాబు నువ్వు అబద్దాలతో ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నావు. నీకు 40 ఏళ్ల రాజ కీయ అనుభవం ఉంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రి గా పని చేసిన వాడివి .. నీ అనుభవం అంతా ఏమైంది ? 
ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి నువ్వు చేస్తున్న దుష్ప్రచారం క్షమించరాని పాపం . 
        ఒక రాజకీయ పార్టీ భాద్యత ఏమిటి ? ఇటువంటి విషయాల పైన ప్రజల్ని చైతన్య వంతుల్ని చేస్తావా ? తప్పుదారి పట్టించి పబ్బం గడుపుకుంటావా ? 
           నేను సోషల్ మీడియా లో చూసాను . అనకాపల్లి మీటింగ్ సందర్భం గా దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ చట్టం పైన వివరణ ఇచ్చారు . దేశ వ్యాప్తం గా ఈ చట్టం అమలు చేస్తామని ఆయన అన్నట్టు చూసాను ... ఇపుడు చంద్రబాబు మొహం ఎక్కడ పెట్టు కుంటావు. పక్కన బీజేపీ నీ పెట్టుకున్నావు.
నీ మేనిఫెస్టో ని వాళ్ళు కనీసం ముట్టడానికి  కూడా సాహసం చేయలేదు . ప్రజలకు నీ సంగతి తెలుసు..2014 లో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేసావో చెప్పగలవా ? చెప్పలేవు . నీ విధానం ప్రజలకు తెలుసు ... అబద్దాలు చెప్పడం , ప్రజల్ని తప్పు దారి పట్టించడం . 
      ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయం లో నువ్వు క్షమించరాని నేరం చేస్తున్నావు చంద్రబాబు . ప్రధానమంత్రి, బీజేపీ నేతలు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ నమూనా చట్టం రూపొందించిందని చెబుతున్నారు , మరో ప్రక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ చట్టం నీతి ఆయోగ్ ప్రతిపాదన అని చెబుతున్నారు.. కానీ చంద్రబాబు మాత్రం సిగ్గు లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయించి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు.. చంద్రబాబు లాంటి దివాళా కోరు, దిగజారుడు  రాజకీయనాయకుణ్ణి నేను చూడలేదు. 
       ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకొని , రాష్ట్ర ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ధర్మాన డిమాండ్ చేశారు.

Back to Top