చ‌ట్టం.. మీ చుట్ట‌మా?

మాజీ మంత్రి పేర్ని నాని

పోస్టల్‌ బ్యాలెట్లపై సీఈవో సర్క్యులర్‌ చట్టవిరుద్ధం 

దీనిని  కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎలా ఆమోదిస్తుంది?  

కోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేస్తే సీఈవో మెమోను వెనక్కి తీసుకున్నారు 

తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది: పేర్ని నాని

 మచిలీపట్నం: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి,  ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు.  పోస్టల్‌ బ్యా­లెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్‌ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్‌) లేకపో­యినా ఫర్వాలేదని, స్పెసిమెన్‌ సిగ్నేచర్‌ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీక­రిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెన్‌ సిగ్నేచర్‌ల­ను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మ­రోలా నిబంధన ఎలా ?
13 ఏ, 13 బి పోస్టల్‌ బ్యాలెట్‌లు ఇస్తారని, దానికి గెజిటెడ్‌ ఆఫీసర్ సర్టిఫికెట్‌ ఇస్తారని, ఫారం 12 ఏ అనేది ఎక్కడ నుండి వచి్చందని ప్రశి్నంచారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్‌ కూడా ఓకే చెప్పిందని, దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మ­రోలా నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశి్నంచారు. చివరికి కోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు. ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా స్పష్టమైందని, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు. 

చివరకు న్యాయమే గెలుస్తుంది
టీడీపీ ఎన్డీఏ­­తో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారంపైనా పోరాటం చేస్తా­మని, చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకుందని వెల్లడించారు. న్యాయ వ్యవస్థతో సమానంగా బాధ్యతగా మెలగాల్సిన హోదాలో, ఎన్నికల సంఘంలో ప్రమా­ణం చేసి, ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోందన్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌పై ఎక్కువ కేసులు పెట్టాల‌ని ఆదేశాలు
రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీడీపీ తప్పులను ఎత్తి చూపిస్తున్నప్పటికీ పట్టించుకోని సీఈవో.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు వస్తే వెంటనే స్పందించి తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు, ఆర్వోలను బెదిరిస్తున్నారని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. 

Back to Top