తాడేపల్లి: విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సీఎం వైయస్.జగన్ నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు.