గుంటూరు: వైయస్ జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్పష్టమైన ఫలితాలు మళ్లీ ఏపీలో రాబోతున్నాయన్నారు. ‘‘ప్రజల నాడి, హృదయ స్పందన వైయస్ఆర్‌సీపీ వైపు ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంటే టీడీపీ భయపడుతుంది. ప్రజా తీర్పు అంటే టీడీపీ ఎందుకు భయం?. ప్రజా తీర్పును గౌరవించడానికి, ఓటమిని స్వీకరించడానికి టీడీపీ జీర్ణించుకోలేక పోతుంది. వైయస్ జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు’’ అని రావెల పేర్కొన్నారు