ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై విష ప్రచారం  

వైయ‌స్ఆర్‌సీపీ గ్రివెన్స్‌ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి 

తాడేప‌ల్లి: ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద కొన్ని పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ గ్రివెన్స్‌ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి మండిప‌డ్డారు. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశాం.ఐవిఆర్ ఎస్ వాయిస్ కాల్స్ ద్వారా ప్రజలను భయానికి టీడీపీ గురి చేస్తుంద‌ని ఫైర్ అయ్యారు. మా ఫిర్యాదుపై సిఐడి ఎఫ్ ఐ ఆర్  ఫైల్ చేసి విచారణ చేస్తున్నప్పటికి ఇష్టాను సారంగా టీడీపీ వ్యవహరిస్తుంది.

 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని తుంగలో తొక్కుతున్నారు. ఈసి నోటీసులు అమలులో ఉన్నా కూడా వాయిస్ కాల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి.ఇదంతా చూస్తూ ఎన్నికల కమిషన్ సైలెంట్ గా ఉంది. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలి..కేవలం నోటీసులు ఇచ్చి ఊరుకుంటే తెలుగుదేశం పార్టీ బరితెగించి వ్యవహరిస్తోంది. తెలుగుదేశం పార్టీ వైఖరి కుక్క తోక వంకర అన్నట్లుగా వ్యవహరిస్తుంది. తెలుగుదేశం పార్టీ మాయమాటలు నమ్మితే నట్టేట మునగడం ఖాయం. దోచుకున్న సొమ్ముతో  పత్రికలలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే రాష్టం సర్వ నాశనం అవుతుంద‌ని నారాయ‌ణ‌మూర్తి వ్యాఖ్యానించారు.

Back to Top