తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల మే 11 వ తేదీ షెడ్యూల్ ను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు 11 వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని కైకలూరు నియోజకవర్గ కేంద్రంలో తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం నియోజకవర్గం కేంద్రంలో ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.