బాబు సృష్టించిన తప్పుడు ప్రచారాలు.. » మీ ఆస్తులకు జిరాక్సు కాపీలు ఇస్తారు. ఒరిజినల్ పత్రాలు ఇవ్వరు.. – ఇది పచ్చి అబద్ధం » మీ ఆస్తులకు గ్యారంటీ ఉండదు. మీ భూములు లాక్కుంటారు.. – ప్రజల ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది.. » మీ ఇళ్ల స్థలాలు ఎత్తుకెళ్తారు. మీ యాజమాన్య హక్కులు నిరూపించుకోవాలి.. – స్థలాలను ఎత్తుకెళ్తారనేది అపోహే » కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు.. – నిరభ్యంతరంగా కోర్టుకు వెళ్లొచ్చు. » మీ వారసులకు భూములు దక్కవు.. – మీ వారసులకే భూములు దక్కుతాయి » ఇది కేంద్ర చట్టం కాదు. రాష్ట్రమే తెచ్చింది.. – కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఈ చట్టం గురించి సిఫారసు చేసింది » మీ పాసు పుస్తకాలు మీ దగ్గర ఉండవు.. – మీ పాస్ పుస్తకాలు మీ దగ్గరే ఉంటాయి ప్రజలారా చంద్రబాబు మాటలు విని మోసపోవద్దు » భూముల్ని మింగిన చంద్రబాబు మీ భూముల్ని కాపాడతాడా? » అమరావతిలో రూ.వేల కోట్ల విలువైన భూముల్ని దోచేసిన వాడు భూముల రక్షకుడా? » విశాఖలో లక్ష ఎకరాల భూముల రికార్డుల్ని మాయంచేసిన మాయావి మీ భూములకు భద్రత కల్పిస్తాడా? » వైఎస్ జగన్ హయాంలో ఒక్క భూకుంభకోణం జరగలేదు » చంద్రబాబు హయాంలో అమరావతి భూముల కుంభకోణం, విశాఖ లక్ష ఎకరాల కుంభకోణం, సదావర్తి భూముల కుంభకోణం వంటివి ఎన్నో జరిగాయి. » జగన్ హయాంలోనే భూములకు రక్షణ. » చుక్కల భూములకూ విముక్తి కల్పించింది జగ¯ó... » షరతుల గల పట్టా భూములకూ విముక్తి కల్పించింది జగన్ » అసైన్డ్ భూములకూ హక్కులు ఇచ్చినవాడు జగన్ » చంద్రబాబు భూములు లాక్కుంటే.. జగన్ భూములు ఇచ్చాడు. ఇక దుర్మార్గాలేంటి? మీ దస్తావేజులు మీకే ఇస్తారు. ప్రస్తుతం కూడా ఇస్తున్నారు. గత 3 నెలల్లో 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వారందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారు. » చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ ఇటీవల రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకున్నాడు. » అలాగే, పవన్‌కళ్యాణ్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒరిజినల్స్ తీసుకున్నాడు. కానీ, ప్రజలను మాత్రం జిరాక్సు కాపీలని భయపెడుతున్నాడు. » అధికారం, డబ్బు, కండబలంతో మీ భూముల్నిఎవరూ కొట్టేయలేరు. అది అసాధ్యం » మీ వారసుల్ని నిర్ణయించేది మీరే. అందులోఅధికారుల ప్రమేయం ఉండనే ఉండదు » జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చనేది చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారం » ప్రస్తుతం ల్యాండ్ టైట్లింగ్ చట్టమేలేదు. అలాంటప్పుడు ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్‌ని ఎలా నియమిస్తారు? » ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగాకోర్టుకు వెళ్లొచ్చు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం వాస్తవాలు.. » ప్రజల ఆస్తులను కాపాడ్డానికే ‘ల్యాండ్ టైట్లింగ్’ » దీన్ని ఇంకా అమలు చేయడంలేదు. అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన మాత్రమే ఇచ్చింది. అమలుకు నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు » నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏ చట్టం అమలుచేయలేరు » రాష్ట్రమంతటా ఈ చట్టం ఒకేసారి అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలన్నీ పరిష్కరమయ్యాక, గ్రామాల వారీగా భూముల తుది రిజిస్టర్ రూపొందించిన చోట్ల కాలానుగుణంగా చట్టం అమల్లోకి వస్తుంది. » నోటిఫికేషన్ ఇవ్వాలంటే రీసర్వే పూర్తవ్వాలి. ఆరు వేల గ్రామాల్లోనే సర్వే పూర్తయింది. ఇంకా 11 వేల గ్రామాల్లో పూర్తవ్వాలి. అప్పుడే చట్టం అమలుచేసే అవకాశం ఉంటుంది. » ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి, రిజిస్ట్రేషన్లకు సంబంధంలేదు. భూపత్రాలు యాజమానుల వద్దే ఉంటాయి. జిరాక్సు కాపీలు ఇస్తారనేది దుర్మార్గపు ప్రచారం » ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలైనా కోర్టుకు నిస్సంకోచంగా వెళ్లవచ్చు. » వారసత్వ ఆస్తులను మ్యుటేషన్ తరహాలోనే చేసుకోవచ్చు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దాన్ని నిర్ణయించలేడు. » ఈ చట్టం 90 దేశాల్లో అమల్లో ఉంది. మహారాష్ట్ర కూడా ల్యాండ్ టైట్లింగ్ మోడల్ చట్టం చేసింది. » 2019లో నీతి అయోగ్ అన్ని రాష్ట్రాలు ఈ చట్టం చేసుకోవాలని చెప్పింది » ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ మద్దతు తెలిపింది.