అల్లూరి సీతారామ‌రాజు పోరాటం నేటి యువ‌త‌కు ఆద‌ర్శం

అల్లూరి వర్ధంతి సంద‌ర్భంగా వైయ‌స్ జగన్ నివాళి 

తాడేపల్లి: దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామ‌రాజు  చేసిన‌ పోరాటం నేటి యువ‌త‌కు ఆద‌ర్శమని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. నేడు అల్లూరి సీతారామ‌రాజు వ‌ర్ధంతి సందర్భంగా వైయ‌స్‌ జగన్ నివాళుల‌ర్పించారు.  ఈ మేర‌కు ఎక్స్ ఖాతాలో ఆయ‌న పోస్టు చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌.. 
‘బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గ‌డ‌గ‌డ‌లాడించి తెలుగు వారి హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు. అడవి బిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయ‌న చేసిన‌ పోరాటం నేటి యువ‌త‌కు ఆద‌ర్శం. నేడు అల్లూరి సీతారామ‌రాజుగారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు. 

Back to Top